Posts

Showing posts from October, 2026

"సిక్కోలు వైభవము"

          *సిక్కోలు వైభవము* సిక్కోలు వైభవము కనరార సిక్కోలు చరితము వినరార పుణ్యచరితలున్న పుడమిరా ఇది ధన్య చరితలు గన్న ధరణిరా ఇది త్యాగధనులు నిలిచిన వసుధరా ఇది కళలకు కాణాచియై వెలుగురా ఇది  నాగావళి పరవళ్ళు తొక్కింది ఈనేల  వంశధార ఉరకలేసింది ఈ చోట బాహుదా మహేంద్రనదులు నడచినవి ఇక్కడ నలువైపులా నీళ్ళు నడయాడినిలిచినవి ముఖలింగ ఆలయ శిల్ప కళా వైభవము సూర్యనారాయణుని ప్రత్యక్ష దర్శనము శ్రీకూర్మమున వెలసిన శ్రీ విష్ణు అవతారం రావి వలసలో వెలసిన ఆఎతైన లింగము స్వదేశీ పరదేశీయులు పాలించిరీచోట సంస్కృతుల సమ్మేళనం జరిగింది ఈచోట కలిసి మెలిసి పెరిగి నిలిచింది ఈచోట శ్రీకాకుళం జిల్లాగామారింది చరితలో సాహితీ లోకాన మేటి మహనీయులెందరో పలు రచనలు చేసి ప్రఖ్యాతి నొందారు గిడుగు,గరిమెళ్ళ,గౌతు లచ్చన్న లు వంటి వారెందరో చరితలున్న నేల వలస పక్షులు వచ్చి విహరించె నిచ్చట బౌద్ధారామాలు చరితమున్నదిచ్చట కళాకారులుఎందరో ఖ్యాతి నొందిరిచ్చట క్రీడాకారులు ఎందరో కీర్తినొందిరిచట  జయము జయము తల్లి సిక్కోలు తల్లి జయ విజయములిమ్ము శ్రీకాకుళపుతల్లి రచన-లోకనాథం సత్యా నందం,శ్రీకాకుళం.

"ఆకుకూరలు తినండి ఆరోగ్యంగా ఉండండి"

 ఆకుకూరలు తినండిఆరోగ్యంగా ఉండండి ఓలమ్మ ఆకుకూరలు ఓరయ్య పచ్చ కూరలు  చులకనగా చూడకండి  చౌక అని వదలకండి  తోటకూర తినండి  ఎముకలకు బలమండి గోంగూర తినండి రక్తం పెరుగు నండి చుక్కకూర తినండి  జ్వరం తగ్గుదల వచ్చునండి పుదీనా తినండి గ్యాస్ తగ్గిస్తుందండి కొత్తిమీర తినండి  కిడ్నీకి మంచిదండి  బచ్చలి కూర తినండి బరువు తగ్గుతారండి  కరివేపాకు తినండి  కేశాలకు మంచిదండి  ఉల్లికాడలు తినండి  గుండెకు మంచిదండి రచన-లోకనాథం  సత్యానందం,శ్రీకాకుళం.

"ప్రజల దైవం పైడిమాంబ తల్లి"

   (ప్రతి సంవత్సరం దసరా తర్వాత విజయనగర లో పైడిమాంబ పండుగ చేస్తారు, అశేష జనవాహిని తరలివస్తారు)      * ప్రజల దైవం పైడిమాంబ* వందనాలు వందనాలు పైడిమాంబ తల్లి  శతకోటి వందనాలు అమ్మవారు తల్లి  ఉత్తరాంధ్ర దైవంగా కొలుస్తారు తల్లి  కోరిన కోర్కెలు తీర్చే కరుణామయి తల్లి  ఆది పరాశక్తి రూపం నీవమ్మ అఖిల లోకానికి తల్లివి నీవమ్మ ఆపదలో ఆదుకున్న అమ్మ వు నీవమ్మ  పాడి పంటలనిచ్చే పౌష్య లక్ష్మివినీవమ్మ ప్రతి ఏటా పండుగ చేస్తారు తల్లి  భయ భక్తులతో పూజిస్తారు తల్లి  దూరదూరం నుంచి వస్తారు తల్లి  దర్శనమైతే చాలు తరిస్తారు తల్లి  సిరిమానులోఅమ్మవారు ఆవహిస్తావమ్మ అదృశ్యం కోసంజనం ఎదురు చూస్తారమ్మా ఇసుకపోస్తే రాలనంత జనమొస్తారమ్మా జేజేలు పలుకుతారు పైడిమాంబ తల్లికి రచన -లోకనాథం సత్యానందం, మా స్టారు శ్రీకాకుళం .

తలుపులు తాళాలు లేని ఊరు"

 *తలుపులు తాళాలు వేయని ఊరు  (బ్యాంకు కూడా తాళాలు ఉండవు.)  దైవ శక్తి గొప్పదని చెప్పడానికి కొన్ని ఉదాహరణలు ఉంటాయి, అలాంటి వాటిలో ఒకటి మహారాష్ట్రలోని శని సింగనాపూర్ ,అహల్యా నగర్ (పూర్వపు అహమ్మద్ నగర్ )జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన షిరిడీకి 65 నుంచి 74 కిలోమీటర్ల దూరంలో ఉన్న క్షేత్రం, శని సింగనాపురం.  శని సింగనాపురం అంటే శని దేవుని క్షేత్రం సుమారు 300 సంవత్సరాల క్రితం వరదల్లో కొట్టుకు వచ్చిన పెద్ద నల్లటి రాతిబండను గ్రామస్తులు ప్రతిష్టించారు.  శని దేవుడు గ్రామ పెద్ద కలలోకి వచ్చి నాకు ఎలాంటి పైకప్పు గుడి వద్దని నేను ఊరిని కాపాడతానని చెప్పినట్లు కథనం ,శని దేవుని దర్శించుకునేందుకు భక్తులు వస్తారు దోష నివారణకు పూజలు చేస్తారు ,అయితే ఇక్కడ విశేషం ఏమంటే ఈ గ్రామ ప్రజలు ఇల్లకు తలుపులు ఉండవు అవి లేకపోతే తాళాలు ఎలా ఉంటాయి ?అంత బాహాటంగా ఉన్నా దొంగతనానికి ఎవరూ ప్రయత్నించరు, కారణం శని దేవుడు ఆగ్రహిస్తాడని అలా చేసిన వారు గతంలో పెద్ద శిక్షలు అనుభవించారని చెబుతారు, మరో విశేషం ఏమంటే యూకో బ్యాంక్ శాఖ 2011లో ప్రారంభమైంది, ఆ బ్యాంకు కూడా తలుపులు ఉండవు. తాళాలు అవసరం లేదు.

గరివిడి లక్ష్మి సినిమా పై జానపద గీతం"

 *గరివిడి లక్ష్మి" సినిమాపై జానపద గీతం* -------------------------------------------------  పల్లవి -అందరూ చూడగ రారండి బాబు    అమ్మ లక్కలు చూద్దాం రారండి అమ్మ  చ-అందరూ చూసిన సినిమాలు ఎన్నో వచ్చాయి కానీ  ఈ సినిమా చాలా బాగుంది  గరివిడి లక్ష్మి బుర్రకథ సినిమా తీశారు  ఆమె పాట మాట నచ్చి అందరు మెచ్చారు, చ-కష్టాలు ఎన్నో ఓర్చి ఆమె కళాకారిణి  అ్యయ్యింది  బాలనాగమ్మ కథల బాగా చెబుతుంది  నాన్న లేని చిన్నతనాన్ని ఎన్నో కష్టాలు పడింది  గరివిడి దగ్గర పుట్టిన ఆమె గరివిడి లక్ష్మి అయ్యింది,  చ-80-90 దశకాల్లోన ప్రదర్శనలు ఇచ్చింది, పదివేలకు పైగా స్టేజీ లెక్కి పేరు పొందింది,  సినిమాలు వచ్చి జానపద కళల ఆదరణ తగ్గింది,  తోటి వారితో బేధాలు వచ్చి బాధలు పెరిగాయి, చ-లక్ష్మీ అమ్మ సన్యాసినిగా దేవుడమ్మ అయింది,  బాల్య వివాహం చేసి లక్ష్మీ కొంప మునిగింది,  నమ్మినోడు మోసం చేసి నడిరోడ్డున వదిలేస్తే, కన్నీళ్లను గుండెల్లో దాచి కళ వైపే నడిచింది,  చ-కష్టాలోర్చి కళాకారిణిగా పేరు పొందింది, బృందంలో తగువులు వచ్చి ఆదరణ తగ్గింది,  అద్భుతమైన గొ...

"పార్వతి పుత్రుని పాట"

           *పార్వతి పుత్రుని పాట* గౌరమ్మ తనయ గణపతి దేవ  కాపాడ రావ కరుణించు దేవ  విఘ్నాలు బాపే విఘ్నేశ్వరుడా అమ్మ నలుగుతో బొమ్మగా మారి నాన్న గొడవతో రూపము మారి ఆది పూజుడై అఖిలలోకాలకు  వినాయకుడివై వెలుగొందినావు గరిక పూలు అన్న గొప్ప ఇష్టము పప్పు బెళ్లాలంటే పరమ ఇష్టము  కుడుము ఉండ్రాళ్ళు ఇంకా ఇష్టము  వెలగ పళ్ళు పళ్ళు అంటే చాలా ఇష్టం  శంభు తనయుడు శుభంకరుడు  విఘ్న వినాశకుడు విజయ స్వరూపుడు ఎలుక వాహనంపై ఎల్ల లోకములు తిరిగే పార్వతి పుత్రుడు పరమ దయాకరుడు జయ జయ విఘ్నేశా జయము నీయవా శుభకర గణేశా శుభముల నీయవా  ఆనందరూపుడా ఐశ్వర్యాన్నీయవా ఆది దేవుడవు నీవు అభయము నీయవా పేరు -లోకనాథం సత్యానందం మాస్టా రు  ఊరు -శ్రీకాకుళం.

"బ్రతుకేంటి ఇలా ఉంది"

             * బ్రతుకేంటి ఇలా ఉంది* ఎంతో హాయిగా గడప వలసిన సమయం  ఎంతో ఆందోళనగా గడప వలసి వస్తుంది  అరవైదాటినాక ఆనందమనుకున్నా కానీ  అప్పుడే మొదలైంది అసలు జీవితం  జీవితం పరుగులో బాధలు బందీలు తెలియలేదు. కర్తవ్య నిర్వహణలో బాధ అనిపించ లేదు  దైవం కరుణించాక, బాధలు ఒడ్డెక్కాక మిగిలిన సమయం, అంతా శూన్యం ,ఒంటరి తనం, శాసించే గొంతు బొంగురు పోయింది సాహసించే శరీరం చతికిలి పడి పోయింది  చలనం తగ్గిన వస్తువులా మూల చేరింది మనతో మాట్లాడటానికి, మన మాట  వినడానికి కరువయ్యారు. క్షణం క్షణం భయం భయం ఏక్షణం ఎలా ఉంటుందో  ఎలాంటి వార్త వింటామో ఎలా తట్టు కుంటామో అమ్మ చేతి వంట  నాన్న చెప్పిన పాఠం  తాతయ్య చెప్పిన పద్యం  అమ్మమ్మ చెప్పిన కధ అప్పుడు పుస్తకం పట్టుకుంటే నిద్ర  ఇప్పుడు ఎన్ని పట్టుకున్నా రాదేం నిద్ర అప్పుడు ఏది తిన్నా రుచిగుండేది  ఇప్పుడు ఎన్నున్న రాదు ఆరుచి  తిన్నట్టు ఉంటుంది,తినలేనట్టుంటుంది  పేరు చెప్పాలన్నట్టుంది, గుర్తుకు రాకుంటుంది, తీపి తింటే సుగరుకు కోపం వస్తుంది  కారం తింటే బీపీకి చిరాకు పెర...

"పెళ్లి మాయ"

               * పెళ్లి మాయ* పెళ్ళీడొచ్చిందని ప్రయత్నాలు చేశారు  మగ పిల్లలు పెళ్లంటే మహా చికాకుగా ఉంది మరీ నాడు పెళ్ళీడు వచ్చింది పిల్లకు తిరిగాను ఎన్నెన్నో చూసాను ఒక పిల్ల నచ్చింది  కట్నం ఇవ్వనన్నారు సరే అని అన్నాను కానుకలు అన్నారు వద్దులే అన్నా తీరా ఆలు చేసిన మాయమేటంటే బాగున్న రెండో అమ్మాయి చూపించి   మొదటమ్మాయి కి మేకప్ వేసి పెళ్లి చేశారు. నీ కళ్ళేమో కాకు లెత్తుకెళ్ళాయా అనవచ్చు, తొందర్లో కొన్ని పొరపాట్లు  జరిగి పోతాయి కదండి  అదే ఆలకి వరంగా నాకు శాపంగా  మారింది. మేకప్ చేసి మాయం చేసావే అమ్మాయమ్మ  తొలగించి తీరా చూస్తే తెలిసిందే  తాయారమ్మ  కలలెన్నో కన్నానే కాజోలమ్మ ఆశలెన్నో పెట్టుకున్న అనసూయమ్మ ఆశలన్ని అడియాశలైనాయి తాయారమ్మ  కలలన్నీ కల్లలయినాయి ఓ కాంతమ్మ మంచి కూడుకు కూరదొరకదుఓ మల్లమ్మ నా బాధెవరితో చెప్పుకోను ఓ భారతమ్మ పచ్చచేలలో పరికిణి కట్టిన పిల్లలా  గట్టుమీద చెంగు చెంగున ఎగిరే దూడలా  ఆకాశం నుంచి దిగి వచ్చిన దేవతలా అనుకున్నా ఎంతెంతో ఆశతో  వచ్చి పడింది పంది పిల్లలా  అరుస్తుం...

"హెల్మెట్"

           * హెల్మెట్ * బండి నడపరా భయ్యా  జాగ్రత్తగా ఉండరయ్య   ప్రాణం ముఖ్యం కదరయ్య  ఆలోచించి కదలరయ్య ...... . బండి  కుర్రకారు కల కాదనను కాని  బైక్ కొనడం తప్పనను కాని విన్యాసాలు ఎందుకు చేస్తవ్ ప్రాణాలు మీదకు ఎందుకు తెస్తవ్.. "బండి  పెళ్లి అయితే బైక్ కోరుతరు తల్లి తండ్రుల బుర్ర తింటరు ఫైనాన్స్ పెట్టి అయినా కొంటరు  కాని జాగ్రత్త లెందుకు తీసుకోరు .."బండి " అన్ని పత్రాలు ఉన్న వారెందరు? ఎందుకంత అలసత్వం కొందరు బళ్ళమోజుకంటే ప్రాణం గొప్పది  తెలిసినా ఎందుకు తెలుసుకోరు.. "బండి " ఫోన్ పోతుందిని గార్డు పెడతారు  బండెక్కితే హెల్మెట్ ఎందుకు పెట్టరు భార్య పిల్లలు గుర్తు తెచ్చుకో వలె బాధ్యతగాను బండి నడపవలె "బండి"    రచన -లోకనాథం సత్యానందం,మాస్టారు శ్రీకాకుళం, ఫోన్ -9182863928. హెల్మెట్ పెట్టుకో జీవితాన్ని నిలబెట్టుకో  ఆదమరిచావో ఆపదలో పడ్డట్టే  ఫోనుతో డ్రైవింగ్ చేయొద్దు  హెల్మెట్ పెట్టకుండా ప్రయాణం వద్దు  బయలుదేరే ముందు భార్య హెల్మెట్తో ఎదురవ్వాలి.  అతి స్పీడ్ ప్రమాదకరం. ప్రయాణం లో ప్...

"శివాజీ సింహం"

  (శివాజీ మహారాజ్ జయంతిసందర్భంగా)           *శివాజీ సింహం*  సింగమురా శివాజీ సింగమురా దేశభక్తితో వెలిగిన రాజసమ్ము రా హైందవంలో పుట్టిన అధ్భుతమ్ము రా  ఉదయించిన అరుణారుణ బింబమురా జాతి మనుగడే ప్రశ్న గా మారిన జ్వలించిన అనల విస్ఫులింగమురా ఛండ ప్రచండ మారుతమ్ము రా ఉరిమి ఉరిమి విరుచుకు పడు నిప్పు కణమురా, ఉగ్గుపాలతో పాటు దేశభక్తి భుజించిన అగ్గి పిడుగు ఆటలు తో రాటుదేలిన పరదేశీయులంటే పరమ చిరాకు పడిన మన జాతి శ్రేయస్సునే సదా కాంక్షించిన ఒంటి నిండ గాయాలు, కంటినిండ క్రోధం అలుపెరుగని దాడులు,అహర్నిశం ఆవేశం ధైర్యమే సాహసం, సడలని మనో నిబ్బరం ఒక్కడైన చాలు వేయిమంది తో సమానం  ఎత్తుకు పై ఎత్తు తోనే చిత్తు చేసె వైనం  గెరిల్లా పోరాటంతో గుణపాఠపు నైజం  పక్కా ప్రణాళికతో పథక రచన చేయడం ఒంటరి పోరాటంఎందరికోస్ఫూర్తిదాయకం రచన :-లోకనాథం సత్యానందం మాస్టారు,శ్రీ కాకుళం,ఫోన్ 9182863928.

"తెలుగు గొప్ప దనం తెలుసుకో బిడ్డ"

  *తెలుగు గొప్ప తనం తెలుసుకోబిడ్డ* తెలుగు గడ్డ మీద పుట్టే పురిటి బిడ్డ  తెలుగు ఎందుకు అంత నీరసం బిడ్డ  నన్నయ నుంచి నేటి వరకు సాహిత్యం  నరనరాన జీర్ణించుకుంది మన గడ్డ అందమైన భాష అజంత భాష అని దేశ భాషలందు తెలుగు లెస్స అని  పలు ప్రక్రియలు కల్గు గొప్ప భాషని వచియించుట నీ చెవులకు తాక లేదా  వేయేళ్లకు ముందు నుంచి ఉందని పలు రాజులు కాలంలో పోషించెనని ఉధ్ధండ పండితులెందరో వెలిగి రని కనలేదామన నేల కాల చరిత నందు కృష్ణ రాయలు నోట కీర్తించిన మాట విదేశీయులు ఇటాలియన్ ఈస్ట్ అన్న మాట. పక్క రాష్ట్ర కవులు పలుకు మాట మన భాష సొగసు గొప్ప దన్నమాట అవధానం ఆవకాయ మన సొంతం  అజంతా భాష అందమైన అక్షర ఆకారం  సంగీత సాహిత్యాలకు అనువైన భాష  అనవరతము అనర్ఘ రత్నం ఆణిముత్యం  రచన -లోకనాథం సత్యానందం, మాస్టారు శ్రీ కాకుళం.ఫోన్-9182863928.

"కళాతపస్వి విశ్వనాథ్"

        *కళాతపస్వి విశ్వనాథ్* ప్రణామం ప్రణాం కళా తపస్వికి  ప్రణామం ప్రణామం ప్రజా తపస్వికి  ప్రణామం ప్రణామం దర్శక తపస్వికి  ప్రణామం ప్రణామం సంగీత తపస్వికి  ఆత్మగౌరవం సినిమా తో మొదలుపెట్టి  సంగీతసాహిత్యాలసినిమాలనుఒడిసిపట్టి  ప్రజల నాడి పసిగట్టి తెరపై వదిలి పెట్టి విజయాలుపొంది,విశ్వనాథుడయ్యారు, శంకరాభరణం సినిమా ఓ సంచలనం  పాటల ప్రభంజనం అఖండ విజయం  ఎక్కడ విన్న అవే పాటలు, మాటలు  మారు మోగిపోయింది తెలుగు దేశం ఊగిపోయింది తెలుగు సినిమా రంగం  సినిమా రంగం దిశ దశను మార్చారు   సంగీత ప్రియులు అభిరుచి మార్చారు  సినిమా రంగం కదలికి మొదలైంది. కొత్త వరవడితో శ్రీకారం, చుట్టింది . స్టార్ డమ్ వదిలి, సామాన్య డం  పట్టుకొన్నారు, సంచలన హిట్ సాధించారు నటీనటులు కు ఎనలేని గుర్తింపు వచ్చింది  కళాకారులుకు సన్మాన గౌరవాలు జరిగాయి  ప్రజాభిమానులు పెట్టే పేరు కళాతపస్వి   వారి సినిమాలుకు తయారయ్యారుఅభిమానులు విశ్వ నాథుని సాగర మధనం లో జనించి న,ఆణిముత్యాలు, ఎన్నో  సాగర సంగమం, స్వాతిముత్యం, సప్తపది వంటివి  సంగ...

"దేశం యొక్క దీన స్థితి"

         *దేశం యొక్క దీనస్థితి* ఏమిటమ్మా ఈ పరిస్థితి  దేశం యొక్క దీనస్థితి  స్వేచ్ఛ కోసం పడే తపన ఎన్నెన్నో పోరాటాలు  ఎన్నెన్నో త్యాగాలు  నేతల జైలు శిక్షలు  చవిచూసిన అక్రమ చట్టాలు  తెల్ల దొరలు దాష్టికాలు చెప్ప లేని ఘోరాలు  వెలుగు చూడని వాస్తవాలు  రెండు శతాబ్దాలు పోరాటం  స్వేచ్ఛ వచ్చింది సంతోషాన్నిచ్చింది కానీ ఏం లాభం                                "ఏమిటమ్మా " గడుస్తున్నాయి సంవత్సరాలు  కొన్ని లాభాలు కొన్ని నష్టాలు  కొన్ని మంచి కొన్ని చెడులు   నేరాలు తగ్గటం లేదు  ఘోరాలు ఆగటం లేదు  మనకు మనమే శత్రువులం  మనకు మనమే రాక్షసులం ... ఏమిటమ్మ ఆడపిల్లలని ఆలోచించరు  కామ పిశాచులు సొంత వారని కూడా చూడరు అధికార ఆరాటంలో ఏమైనా చేస్తారు డబ్బు సంపాదనలో గంజాయి వ్యాపారం  దొంగతనాలు దోపిడీలు మత్తుమందు వ్యవహారాలు దేశరహస్యాలు అయినా....ఏమిటమ్మ నిను పెంచే ఆవులు అవసరం  తీరిపోతే కబేళాలకు పంపిస్తారు. నిను పెంచే తల్లి తండ్రు...

"శ్రీకాకుళం జిల్లా ఊరు కాయలు"

                          * శ్రీకాకుళం జిల్లా ఊరు కాయలు*కవిత అమ్మ అనసూయమ్మ అల్లుడు అమాయకుడనుకున్నాం కాని ఏరిఏరి ఊరి ఊరి కూరగాయలు తెచ్చాడే సంతకవిటి సంత కెళ్ళి వంగర వంకాయలు  ఆమదాలవలస ఆనపకాయలు సారవకోట సారికంద అల్లాడ అల్లం కొత్తూరు కరివేపాకు టెక్కలి టెంకాయలు పలాస పనస కాయలు కవిటి కొబ్బరి కాయలు  పొన్నాడ పొట్లకాయలు సింగుపురం సిరగడి పాలకొండ పొడుగు చిక్కుడు మందస మామిడి కాయలు అంపోలు అరటికాయలు నివగాం నిమ్మ కాయలు గార గుమ్మడి కాయలు కరజాడ కాకరకాయలు  సీతంపేట సీతాఫలాలు రాజాం రాంఫలాలు  వినేవాడుంటే చెప్పేవాడు ఏదైనా చెపుతాడు, మా ఊరి మిరియాలు తాటికాయలంత అన్నాడట, నన్ను అలా అనుకున్నా పర్వాలేదు కానీ  ప్రాసకుదిరింది కదా అని ప్రాకులాడాను. లోకనాథం సత్యానందం మాస్టారు,                                       శ్రీకాకుళం.

"అమ్మ పాట"

              *అమ్మ పాట* అమ్మాయి లో తన బొమ్మ చూస్తది  అబ్బాయి లో తన నాన్న చూస్తది  తన జీవితానికి ఒక అర్థ మంటది  తన పిల్లలే తనకు స్వర్గ మంటుంది అమ్మ రా అదే , అమ్మారా మన జన్మరా,జీవితమ్మురా, నిను పుట్టించిన బ్రహ్మ రా నిను రక్షించిన సైన్యమ్మురా చీకటి గర్భము నుంచి  జాగ్రత్తగా నిను రక్షించి భూమి పైకి నిను దించి  మురిపెము నీ కందించి మురిసి పోయిన అమ్మరా  ప్రాణాలు తెగించిన అమ్మరా పంచ ప్రాణాలు నీవురా  నీ వెన్నంటె ఉండేనురా నీవు తడిపిన బట్టలు తుడిచి  పొడి పొడి బట్టలు పరచి తడిపై తను పడుకుండి వెచ్చని నిచ్చే దమ్మరా కన్ను పడిన ఓర్చుకుని పడుకున్న వరకు తెరుచు కుని కావలి కాసే సిపాయిరా  కను పాపై నిత్యము కాయిరా అమ్మ రుణం నీవు తీర్చలేవురా  అది ఒమ్ము కాదు నిజమ్మురా అణువణువు నిండి ఉందిరా నీ ప్రతి రూపం ఆమె ఆకారంరా రచన -లోకనాథం సత్యానందం,మాస్టారు  శ్రీకాకుళం.ఫోన్-9182863928.

"కొండ కన్నీరు"

            * కొండ కన్నీరు* నాలో బండలున్నాయి  గండెలేదను కుంటున్నారా  ఊరి ప్రక్క కొండగా ఉన్నాను  కాని ఊరిని గమనిస్తున్నాను  ఎలా ఉండే పల్లెలు ఎలా అయ్యాయి బంధాలు అనుబంధాలు ఎలా  తయారయ్యాయి, పండుగలుపబ్బాలుఎలా మారిపోయాయి మానవుని ఆశ ఎలా మితి మీరి పోతుంది చక్కటి చెరువులును ఆక్రమించేస్తున్నాడు కొండలును కొట్టి పిండి చేస్తున్నాడు  పాపం పాలిచ్చే ఆవులుని ఇవ్వడం   ఆపడంతో  కబేళాలకు పంపే స్తున్నాడు  చద్దన్నం తిని పనిచేసుకునేవాడు  సాయింత్రం ముందుకు బానిసయ్యాడు  ఊరికి ఇద్దరో ముగ్గురో ఉండే నాయకులు   నేడు వీధికొక డయ్యాడు అన్నదమ్ముల వాటాల మధ్య దూరి అన్యాయానికి ఒడిగడు తున్నాడు  పశుల పాకలు తగ్గి మెకానిక్  షెడ్డులు వెలిసాయి, పల్లెలు పట్టణాలు వాసన చూసి  రంగులద్దు కుంటున్నాయి  అందరికీ ఆదాయాలు కావాలి  ప్రతీరోజూ పట్నం పోవాలి  రోజూ ప్రత్యేక భోజనం కావాలి  ప్రశాంతంగా ఉన్న ఇంట్లో పొగ రాజేయాలి  నోరున్నోడిదే రాజ్యం అయ్యింది  లాజిక్ తెలిసినోడి దగ్గరే జనం పోగయ్యారు భూములు ఖరీదై ప...

"అప్పటి రోజులు గుర్తొస్తున్నాయి""

             (అరవై దాటిందా)    *అప్పటి రోజులు గుర్తొస్తున్నాయా!* ఆవకాయ వదిలి అరవై ఏళ్లుఅయ్యె పిండి ఒడియం రుచి దూరమయ్యే  వెన్న ముద్దలాంటి చద్దన్నం ముద్దలేవి,  మంటైనా పచ్చి మిరప రుచేది సిల్వరు,స్టీల్ క్యేరేజ్ లు పట్టుకుని  గబగబ నడుచుకుంటూ పరిగెత్తుతూ దారంట తూరీగలు పట్టుకుంటూ  నేరేడు చెట్టు ఎక్కి పళ్లేరు కుంటూ వర్షంలో తడుచుకుంటూ  చెట్లు కింద దాక్కుంటూ  షర్టుఇప్పి మామిడికాయలు ఏరుకుంటూ  గురువులకు దొరికి దెబ్బలు తింటూ  బాధలో ఉన్న బాల్యం భలే ఆనందం ఇంటర్వెల్ లో బెల్లం జీడిఉండలు  నోరూరించే రంగు పుల్ల ఐస్ లు జేబులలో అమ్మచ్చిన పాకుండలు కాకి ఎంగిలి చేసి పంచుకుంటూ చెరువులుదగ్గర క్యారేజ్ లువిప్పుకుంటూ పకపక నవ్వుకుంటూ తింటూ  బాలకృష్ణుని బాల్యక్రీడలలా ఆహారం ఆరగించేవారం ఆనందంగా  సుఖం దుఃఖం కొంతసేపే  కోపం తాపం మరి కొంతసేపే  కలిసిమెలిసి జీవన బాల్యం కలుషితం లేని ఆ స్నేహం ఆనాటి బాల్యం ఏనాటికి  మరిచి పోలేని మధురానుభూతి  తలచుకుంటే వస్తుంది సంతోషం  అది బూస్ట్ కంటె బెటరనిపిస్తుంది. రచన -ల...

"సారవ కోట చుప్పులు సాంగ్"

       సారవ కోట చుప్పులు సాంగ్  చుప్పులమ్మ చుప్పులు సారవకోట చుప్పులు కొరికి కొరికి తింటేను పరపరమంటాయి  బియ్యప్పిండి వేస్తారు  నూలు పప్పు కలుపుతారు  ముద్ద గానే చేస్తారు  వృత్తల్లా చుడతారు  నూనెలోన వేపుతారు  ఏగినాక తీస్తారు  వడగట్టి ఉంచుతారు  ప్యాకింగ్ లు చేస్తారు ఊరి మీద బస్సెలితే కేకలే వేస్తారు  పిల్లలైతే ఎగబడి సందడే చేస్తారు  తెలిసినోళ్ళు ఎక్కువే కొంటారు  కొత్తగా కొన్నోళ్లు భలేగుందంటారు  ఆడపిల్ల సారెలకు పెద్దవి చేస్తారు చుట్టాలింటికెళితే పట్టుకు పోతారు  అతిధులు ఇంటికి వస్తే చిరుతిళ్ళుగ పెడతారు  కొత్తగా తిన్నోళ్ళు ఏమి రుచి అంటారు. రచన -లోకనాథం సత్యానందం మాస్టారు శ్రీకాకుళం.ఫోన్ 9182863928 . ఇది నా స్వీయ రచన.  

"పల్లె పరిమళం "

       *పల్లె పరిమళం* కోడి కూసెనే పల్లె లేచనే  పల్లె పడుచులే కల్లాపు చల్లెనే చుక్కల తో చక్కని ముగ్గు లేసెనే బాల సూర్యుడే బలిమి చెందెనే వెలుగు రేఖలే విస్తరించెనే  గంగ స్నానాలు పులకరించెనే గుడిలో గంటలుమ్రోగుచుండెనే పల్లె పనులలో మునిగి పోయెనే ఎల్లరు ఒకటై కలిసి ఉండెనే :అచ్చమైన స్వచ్ఛమైన పల్లెలు  చక్కనైన ముచ్చటైన హరివిల్లులు  దేశానికి ఇవి పట్టుకొమ్మలు  అరమరికలు లేని బుజ్జి తల్లులు చెరువు స్నానాలు,నూతి గెంతులు  గడ్డి కుప్పలలో దొంగ ఆటలు  ఆడపిల్లలు ఊయలాటలు  చెట్టు కొమ్మ తో ఊగు ఆటలు  సంక్రాంతి వస్తే సందడే సందడి   పెద్దలకు బట్టలు పెడతారు  పిండి వంటలు వండుతారు  బావల అల్లుళ్ళతో సరదాగా ఉంటాడు  జాతరలే జరుగుతుంటాయి  కోళ్ల పందాలు హుషారుగా ఉంటాయి  దానధర్మాలు చేస్తుంటారు పేకాటలు జరుగుతుంటాయి. రచన -లోకనాథం సత్యానందం మాస్టారు శ్రీకాకుళం. ఫోన్ నెంబర్ -91828 63928. ఇది నా స్వీయ రచన.  

"అందరికీ అమ్మ ఆశీస్సులు"

     *అందరికీ అమ్మ ఆశీస్సులు*- పల్లవి: దండాలు దండాలు బతుకమ్మ  శతకోటి దండాలు బతుకమ్మ  చల్లంగ చూడమ్మా బతుకమ్మ  ఎల్లప్పుడూ కాపాడు బతుకమ్మ                                         " దండాలు " అమ్మ వారి రూపు గౌరమ్మ  ఆదిపరాశక్తి గౌరమ్మ  ప్రకృతి రూపమ్ము గౌరమ్మ  పూలలో దాగున్న గౌరమ్మ. "దండాలు " అమ్మలక్కలందరు అమ్మవారిలా మారి పసుపు కుంకుమలతో ముతైదువులై పలురకాల పూలు, పసుపు, సిద్ధం చేసి  పుష్ప పీఠాన్ని తయారు చేస్తారు భక్తి తో                                         " దండాలు " తంగేడు పూలలో తల్లివి నీవమ్మ  మందారాలు లో ఉండేది నీవమ్మ  చామంతులతో చల్లగా చూస్తావమ్మ రకరకాలు పూలతో దీవిస్తవమ్మ                                            ...

మణికంఠ నామం మహాపవిత్రం "

 *మణికంఠ నామం మహాపవిత్రం* హరిహర పుత్రుడా అయ్యప్ప దేవుడా పంబ వాసుడా పరమపవిత్రుడా  కరిమల వాసుడా కరుణాసముద్రుడా శబరి గిరీసుడా శ్రీ మణికంఠుడా .. "హరి " అయ్యప్ప శరణం అఖిలకోటికి అయ్యప్ప భజన ఆత్మశుద్ధికి  అయ్యప్ప దర్శనం జన్మ ధన్యం  అయ్యప్ప జ్యోతి అజ్ఞాన నాశనం .."హరి" దీక్షలు మొదలయ్యేది కార్తీక మాసం  నల్లని వస్త్రాలు విభూది నీ ఆహార్యం  నెయ్యాభిషేకం కర్పూర హారతి నీకిష్టం స్వామి శరణం అంటూ జపిస్తారు నీనామం. .."హరి"  అదిగదిగో వస్తున్నాడు శార్దూల వాహనుడు  మహిషనుచంపిమహిమలుఎన్నోచూపించి రాజాధిరాజుడై శ్రీ మణికంఠుడై మహిలో అవతరించినమహిమాన్వితుడు                                                     " హరి" దీక్షలు చేయండి భక్తులారా  ధన్యులు కారండి భక్తులారా  ఆత్మ శుద్ధి చేసుకోండి అయ్యలారా  ఆత్మానందం పొందండి అన్నలారా ."హరి" రచన -లోకనాథం సత్యానందం మాస్టారు శ్రీకాకుళం, ఫోన్ 9182863928.

స్థానిక ఎన్నికల సమరం

        పంచాయతీ ఎన్నికల కవిత.-1 ---------------------------------------------- స్థానిక ఎన్నికలొస్తున్నాయి, సమరానికి  సిద్ధం కండి, కుల, మతాలు, కాసులు, వరుసలు కలుపు కుని రండి. దేశానికి ప్రెసిడెంట్ ఎంత గొప్పో  గ్రామానికి ఇతడంతే గొప్ప  పూర్వం రోజులు పోయాయి  కొత్త రోజులు వచ్చాయి  డబ్బులు బాగా పెట్టాలి  బిస్కెట్ లు బాగా వేయాలి  అమ్మ ,చెల్లని, కలపాలి కష్టాలు తీరుస్తానని చెప్పాలి, వాగ్ధానాలు ఇవ్వాలి  అయినాక వదిలేయాలి కానివి చేస్తానని చెప్పాలి  నోట్లో బూరెలు వండాలి గ్రామంలో పార్టీలు కొన్ని ఉంటాయి  మనవైపెవరని లెక్కలేసుకుంటాయి గోడమీద పిల్లలు కొన్ని ఉంటాయు  అవి ఎటుదూకుతాయో తెలియకుంటాయి, మూలనున్న ముసలమ్మలను మోసు కొస్తారు, దూరాన ఉన్న వారిని రాబెడతారు  ఈ ఓటు ఎలా ఇచ్చారని వాదిస్తారు  నీకొకటి నాకొకటని సర్దుబాటు చేస్తారు  రచన -లోకనాథం సత్యా నందం,మాస్టారు, శ్రీకాకుళం.

సీనియర్ దర్శకుని కోల్పోయిన చిత్ర పరిశ్రమ

 సినిమా పరిశ్రమలో సింగీతం ప్రస్థానం  సినిమా సైంటిస్ట్ గా ప్రయోగాలు చేశారు  విభిన్న కథాంశాలతో సినిమాలు తీశారు  దిగ్గజ దర్శకుల దగ్గర సహవాసం చేశారు  కథకుడు సంగీత దర్శకుడు దర్శకుడు  కన్నడ తమిళ తెలుగు చిత్రాలు తీశారు  94వ ఏట కూడా సిమ్ గీతం చేశారు మాటలు లేని మూవీ పుష్పక విమానం  నిజ జీవిత కథ నాట్యాంశ మయూరి  చిత్రమైన వేషంతో అపూర్వ సహోదరులు  తెలుగుదనపు పంతులమ్మ సైంటిఫిక్ మెస్మరిజం ఆదిత్య 365  జానపద పోకడలతో భైరవద్వీపం  చిత్రాలు తీసి చిత్ర పరిశ్రమలో  తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న  సింగీతం శ్రీనివాస్ రావు గారు  సంపూర్ణ ఆయుష్ తో జీవించిన  పరమపదించడం బాధాకరం  గొప్ప దర్శకుల్లో ఒకరైన సింగీతం  గారు లేని లోటు చిత్ర సీమ కు వెలితే  వారికి వినమ్రంగా నివాళులు. లోకనాథం సత్యానందం, మాస్టా రు శ్రీకాకుళం.

గుప్పెడు గింజలు తో గుండె పదిలం

 సూర్యుడు దిశలో తిరిగే ఒక ఆకర్షణీయమైన పసుపు రంగు పువ్వును పొద్దు తిరుగుడు పువ్వు లేక సూర్యకాంతంపువ్వు అంటారు ,సూర్యుడిని అనుసరించడం ప్రకృతిలో ఒక అద్భుతమైన ఈ పువ్వును, ప్రాన్స్ రాజైన 14 వ లూయి, తన చిహ్నంగా పెట్టుకున్నాడు . 1510లో స్పానిష్ పరిశోధకులు మొట్టమొదట న్యూ మెక్సికోలో చూసి స్పెయిన్ కు అక్కడి నుంచి మిగిలిన దేశాలకు ఈ పువ్వుని ప్రాచుర్యంలోకి తెచ్చారు. పొద్దు తిరుగుడు విత్తనాలలో ప్రోటీన్స్ తో పాటు నూనె, కాల్షియం లభిస్తాయి.అలాగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ,గుండె ఆరోగ్యం మెరుగుకు, కొలెస్ట్రాల్ తగ్గించడంలో, రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణలో ,చర్మాన్ని కాపాడటంలో, సహాయపడతాయి, రోజుకు ఒక చిన్న గుప్పెడు(30 గ్రాములు) తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదంటారు.  విత్తనాలు వేయించి చిరుతిండిగా, సలాడ్ గా, స్మూతీలు, బేకింగ్ వంటకాలలో కూడా వాడతారు.  అయితే వేటిని తీసుకున్నా జాగ్రత్తలు పాటించాలి, అలాగే ఈ గింజలు మీద పెంకు తీసి గింజలను ఉపయోగించాలి, ఎక్కువ తీసుకోవడం వల్ల అతిసారము , కడుపు ఉబ్బరం, తిమ్మిరి వంటివి వచ్చేసమస్యులు ఉంటాయని వైద్యుల సూచనలు. వివిధ ఎలక్ట్రానిక్ మీడియాలలో సమాచారం ఆధారంగా నా దైన ...

మానవత్వపు శ్వాస కెప్టెన్ స్మిత్ మఛ్ఛర్

 సత్య సంగతులు ప్రత్యేక కవిత: మానవత్వపు శ్వాస.. కెప్టెన్ స్మిత్ మచ్ఛర్! "గాల్లో 34 వేల అడుగుల దూరం ప్రయాణిస్తున్న విమానం.. హఠాత్తుగా ఉన్మాదిగా మారిన కో-పైలట్ కత్తితో ఘోర దాడి.. చేతులు రక్తమోడుతున్నా, ప్రాణాలు పోతున్నా లొంగని గుండె ధైర్యం! 174 మంది ప్రయాణీకుల ప్రాణాలను కాపాడి, ప్రపంచ దేశాధినేతలనే విస్మయపరిచిన మన భారతీయ వీరుడు, ఫ్లైదుబాయ్ కెప్టెన్ స్మిత్ మఛ్ఛర్ వేదికగా సమర్పిస్తున్న చిన్న అక్షర నివాళి..." నూటికో కోటికో పుడతారు కొందరు ఎక్కడో ఎప్పుడో చేస్తారు సాహసాలు! గగనాన మృత్యువు ఉరిమిచూసిన వేళ మానవత్వపు శ్వాసగా నిలిచారు! వేల మీటర్ల ఎత్తున సాగిన ఘోర ఘర్షణ ప్రాణాలు గాల్లో కలపాలని చూశాడు! గుండె ధైర్యంతో రక్తమోడుతున్నా సడలని పరాయి ప్రాణాలు కాపాడటమే ఆయన తపనైంది! ఆయన సాహసం విశ్వాన్ని విస్మయపరిచింది ప్రాణదాత స్థితి చూసి ప్రపంచాధినేతలు కదిలారు! సాహసవీరుడు కోలుకుని తిరిగి రావాలని సామాన్యుల నుండి అసమాన్యుల వరకు ప్రార్థించారు! కులమతాలకతీతంగా మానవత్వాన్ని గెలిపించి ఈ మనుగడకే సార్థకతను తెచ్చిన మహావీరుడు! బతికిన ప్రతి ప్రాణం ఆయనకు సదా రుణపడివుంటుంది జయహో భారత్ జయహో భారత్ తెలుగు ట్యాగ్స్: స్...

భస్మాసుర హస్తమా!A.I.

 కూలీ నెంబర్ వన్ చిత్రం లో (కలయ నిజమా)స్టైల్       భస్మాసుర హస్తమా!(ఏ.ఐ) పల్లవి- కలయా నిజమా! ఈ ఏ.ఐ.మాయ నిజమా! అలవాటైన సుఖమా !ఇక నిన్ను ఆపగలమా! విజ్ఞాన వనరు సుఖమా! అది ఎంతవరకు నిజమా.! చరణం -1 చేయలేని ఎన్నెన్నో పనులు చేస్తానంటూ వస్తుంది  మాయ చేసి మసి చేసి ఇక్కడ గారడీ చేస్తుంది  నిజాలు అబద్ధాలుగా అబద్దాలు నిజాలుగా, మార్చుతూ ఉంటది మతి పోగొడుతుంటది నిజమా మాయయో మనకర్థం కాదయో చరణం -2 ఏఐ చేసిన ఏమి చేసినా.. ఓహో అంటూ ఉంటామే మాయ చేసినా మర్మమేసిన ...ఆహా అంటూ నమ్ముతామే, చిత్రమైన చిత్రాలెన్నో కళ్ళకు కడుతూ ఉంటది కన్ను కట్టు చేసినట్టుగా భ్రమలో ముంచు తుంటది భస్మాసుర హస్తమా! ఈ వింత లోకమా! రచన -లోకనాథం సత్యానం దం, శ్రీకాకుళం.

ఒక స్వీట్ పీస్ 3000 రూపాయలు

 స్వీట్స్ తినే వారికి ఆశ షుగర్ పేషెంట్లకు నిరాశ ,కానీ స్వీట్స్ లో రకరకాలు ఉంటాయి, ఖరీదైన ఉంటాయి. పేదవాడు 5 రూపాయలు స్వీట్ తింటే మధ్య తరగతి వాడు ఒక పీస్ 30రూపాయలు, తింటే ,ఒక స్వీట్ పీస్ ఏకంగా 3000 రూపాయలు అంటే ఆశ్చర్యం కాక మరేమీ  అది ఎక్కడ అంటారా! మన దేశంలోనే రాజస్థాన్ లోని జైపూర్ లో తయారైన "స్వర్ణ ప్రసాదం" అనే స్వీట్ పీసు 3000 రూపాయలు, కేజీ ధర వింటే గుండెలు గుభేలు మంటాయి, 1 లక్ష 11 వేల రూపాయలు. ఈ ఖరీదైన స్వీట్, పైన్ నట్స్  (చిల్గోజా) కుంకుమపువ్వు ,బంగారు భస్మము వంటివి కలిపి తయారు చేస్తారట.  బంగారు భస్మం కలపడం ఏమిటి అంటే? ఆయుర్వేదంలో దీనిని శుద్ధి చేసి వాడినట్లుగా,బంగారాన్ని శుద్ధి చేసి తినదగినట్లుగా కలుపుతారట. మనదేశంలో ఖరీదైన స్వీట్లు తెలుసుకుంటే, ఢిల్లీ, లక్నోలో, లభించే" స్వర్ణ మిఠాయి" దీని ధర కేజీ 20 నుండి 30 వేల రూపాయలు, అలాగే గోల్డ్ ప్లేటెడ్ మోతీచూర్ లడ్డు, దీని ధర కేజీ 12 నుండి 15000, అలాగే డ్రై ఫ్రూట్ హల్వా దీని ధర కేజీ 8000 నుండి 10000 వరకు, ఇలా వివిధ రకాలైన స్వీట్లు ఉన్నాయి, దీపావళి రోజుల్లో ప్రత్యేకమైనవి, ఖరీదైనవి కూడా తయారు చేస్తారు. వివిధ ఎలక్ట్రానిక్ మాధ...

గొప్ప చిత్రం' గాంధీ'

 గాంధీ గారి గురించి మన దేశమే కాదు, ప్రపంచమంతా కొనియాడుతుంది. ఆయన సిద్ధాంతాలు, సందేశాలు ప్రపంచంలో ఎంతోమందిని ప్రభావితం చేశాయి. భారతదేశ జాతిపిత గాంధీ గారి గురించి ఇంగ్లీషులో ఒక చిత్రం తీయడం జరిగింది "గాంధీ" అని పేరుతో.  గాంధీ జయంతి 2026అక్టోబర్ 2, మహాత్మా గాంధీ 157వ జన్మదినం గా జరుపుకుంటున్నాము. ఈరోజు మరో మహానుభావుడు లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి కూడా జరుపుకుంటున్నాం ,ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో అహింస దినోత్సవంగా ఈ రోజు నిర్వహిస్తారు.   సత్యము, అహింస ,శాంతి మార్గాలను, ప్రపంచానికి చాటిన మహాత్ముడు, గాంధీ గారు,వారి ఆశయాలు స్మరించుకుంటూ, ప్రముఖులు రాజ్ ఘాట్ వద్ద నివాళులు అర్పిస్తారు.  ఈ సందర్భంగా ఇంగ్లీషులో తీసిన గాంధీ సినిమా  గురించి చెప్పుకుంటే,ఈ సినిమా  కేవలం ఒక జీవిత చరిత్ర మాత్రమే కాదు, ప్రపంచానికి అహింసా విలువలు చాటిన ఒక అద్భుత దృశ్య కావ్యం . గాంధీ గారిని ప్రభావితం చేసిన పుస్తకాలు, 'అంటు ది లాస్ట్' జాన్ రష్కిన్ రచించింది, "ది కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్  వితిన్ యు "లియో టాల్ స్టాయ్.రచన. 1982లో గాంధీ సినిమా విడుదలైంది. ప్రధాన పాత్ర గాంధీ బెన్ కింగ్ స్లే నటిం...

ANR NTR కలిసి నటించిన చిత్రాలు ఎన్ని?

 తెలుగు చలనచిత్ర పరిశ్రమలో రెండు కళ్ళుగా ఎదిగిన అగ్ర నటులు, అక్కినేని నాగేశ్వరరావు గారు ,ఎన్టీ రామారావు గారు, కలిసి నటించిన చిత్రాలు- 14  1 -పల్లెటూరి పిల్ల -1950  2 -సంసారం -1950  3- రేచుక్క -1954 4-పరివర్తన -1954  5 -మిస్సమ్మ -1955  6-తెనాలి రామకృష్ణ -1956  7-చరణదాసి -1956  8-మాయాబజార్ -1957  9 -భూకైలాస్ -1958 10-గుండమ్మ కథ -1962  11-శ్రీకృష్ణార్జునయుద్ధం -1963  12-చాణుక్య చంద్రగుప్త -1977 13-రామకృష్ణులు- 1978  14-సత్యం శివం- 1981