"బ్రతుకేంటి ఇలా ఉంది"
* బ్రతుకేంటి ఇలా ఉంది*
ఎంతో హాయిగా గడప వలసిన సమయం
ఎంతో ఆందోళనగా గడప వలసి వస్తుంది
అరవైదాటినాక ఆనందమనుకున్నా కానీ
అప్పుడే మొదలైంది అసలు జీవితం
జీవితం పరుగులో బాధలు బందీలు తెలియలేదు.
కర్తవ్య నిర్వహణలో బాధ అనిపించ లేదు
దైవం కరుణించాక, బాధలు ఒడ్డెక్కాక
మిగిలిన సమయం, అంతా శూన్యం ,ఒంటరి తనం,
శాసించే గొంతు బొంగురు పోయింది
సాహసించే శరీరం చతికిలి పడి పోయింది
చలనం తగ్గిన వస్తువులా మూల చేరింది
మనతో మాట్లాడటానికి, మన మాట
వినడానికి కరువయ్యారు.
క్షణం క్షణం భయం భయం
ఏక్షణం ఎలా ఉంటుందో
ఎలాంటి వార్త వింటామో
ఎలా తట్టు కుంటామో
అమ్మ చేతి వంట
నాన్న చెప్పిన పాఠం
తాతయ్య చెప్పిన పద్యం
అమ్మమ్మ చెప్పిన కధ
అప్పుడు పుస్తకం పట్టుకుంటే నిద్ర
ఇప్పుడు ఎన్ని పట్టుకున్నా రాదేం నిద్ర
అప్పుడు ఏది తిన్నా రుచిగుండేది
ఇప్పుడు ఎన్నున్న రాదు ఆరుచి
తిన్నట్టు ఉంటుంది,తినలేనట్టుంటుంది
పేరు చెప్పాలన్నట్టుంది, గుర్తుకు రాకుంటుంది,
తీపి తింటే సుగరుకు కోపం వస్తుంది
కారం తింటే బీపీకి చిరాకు పెరుగుతుంది
మనం సంపాదించిన కాసుతో పెరిగిన
కుటుంబం మనకేం తెలియ నంటుంది.
వృద్ధాప్యం భరించలేని శాపం ఎవరికైనా
అవమానాలు లా ఉంటాయి, కానీ అను
భవించాల్సిందే, కొత్త తరానికి చిరాకు
పెడతాయి,పాత తరానికి ఆందోళన
పెడతాయి.
రచన -లోకనాథం సత్యానందం,మాస్టారు
.
శ్రీకాకుళం ఫోన్ -9182863928.
Comments
Post a Comment