"ఆకుకూరలు తినండి ఆరోగ్యంగా ఉండండి"

 ఆకుకూరలు తినండిఆరోగ్యంగా ఉండండి


ఓలమ్మ ఆకుకూరలు

ఓరయ్య పచ్చ కూరలు 

చులకనగా చూడకండి 

చౌక అని వదలకండి 


తోటకూర తినండి 

ఎముకలకు బలమండి

గోంగూర తినండి

రక్తం పెరుగు నండి


చుక్కకూర తినండి 

జ్వరం తగ్గుదల వచ్చునండి

పుదీనా తినండి

గ్యాస్ తగ్గిస్తుందండి


కొత్తిమీర తినండి 

కిడ్నీకి మంచిదండి 

బచ్చలి కూర తినండి

బరువు తగ్గుతారండి 


కరివేపాకు తినండి 

కేశాలకు మంచిదండి 

ఉల్లికాడలు తినండి 

గుండెకు మంచిదండి


రచన-లోకనాథం

 సత్యానందం,శ్రీకాకుళం.





Comments

Popular posts from this blog

కలబంద కబుర్లు

భస్మాసుర హస్తమా!A.I.

గొప్ప చిత్రం' గాంధీ'