మానవత్వపు శ్వాస కెప్టెన్ స్మిత్ మఛ్ఛర్
సత్య సంగతులు ప్రత్యేక కవిత: మానవత్వపు శ్వాస.. కెప్టెన్ స్మిత్ మచ్ఛర్!
"గాల్లో 34 వేల అడుగుల దూరం ప్రయాణిస్తున్న విమానం.. హఠాత్తుగా ఉన్మాదిగా మారిన కో-పైలట్ కత్తితో ఘోర దాడి.. చేతులు రక్తమోడుతున్నా, ప్రాణాలు పోతున్నా లొంగని గుండె ధైర్యం! 174 మంది ప్రయాణీకుల ప్రాణాలను కాపాడి, ప్రపంచ దేశాధినేతలనే విస్మయపరిచిన మన భారతీయ వీరుడు, ఫ్లైదుబాయ్ కెప్టెన్ స్మిత్ మఛ్ఛర్ వేదికగా సమర్పిస్తున్న చిన్న అక్షర నివాళి..."
నూటికో కోటికో పుడతారు కొందరు
ఎక్కడో ఎప్పుడో చేస్తారు సాహసాలు!
గగనాన మృత్యువు ఉరిమిచూసిన వేళ
మానవత్వపు శ్వాసగా నిలిచారు!
వేల మీటర్ల ఎత్తున సాగిన ఘోర ఘర్షణ
ప్రాణాలు గాల్లో కలపాలని చూశాడు!
గుండె ధైర్యంతో రక్తమోడుతున్నా సడలని
పరాయి ప్రాణాలు కాపాడటమే ఆయన తపనైంది!
ఆయన సాహసం విశ్వాన్ని విస్మయపరిచింది
ప్రాణదాత స్థితి చూసి ప్రపంచాధినేతలు కదిలారు!
సాహసవీరుడు కోలుకుని తిరిగి రావాలని
సామాన్యుల నుండి అసమాన్యుల వరకు ప్రార్థించారు!
కులమతాలకతీతంగా మానవత్వాన్ని గెలిపించి
ఈ మనుగడకే సార్థకతను తెచ్చిన మహావీరుడు!
బతికిన ప్రతి ప్రాణం ఆయనకు సదా రుణపడివుంటుంది
జయహో భారత్ జయహో భారత్
తెలుగు ట్యాగ్స్: స్మిత్ మచ్ఛర్ కవిత, ఫ్లైదుబాయ్ పైలట్ సాహసం, కెప్టెన్ స్మిత్ మచ్ఛర్, పైలట్ స్మిత్ మచ్ఛర్ సత్య సంగతులు, దేశభక్తి కవితలు.
సోషల్ మీడియా హ్యాష్‌ట్యాగ్స్: #SmitMachchhar #HeroPilot #FlydubaiHero #ProudIndian #SatyaSangathulu #TeluguPoetry #Humanity
Comments
Post a Comment