మణికంఠ నామం మహాపవిత్రం "

 *మణికంఠ నామం మహాపవిత్రం*

హరిహర పుత్రుడా అయ్యప్ప దేవుడా

పంబ వాసుడా పరమపవిత్రుడా 

కరిమల వాసుడా కరుణాసముద్రుడా

శబరి గిరీసుడా శ్రీ మణికంఠుడా .. "హరి "


అయ్యప్ప శరణం అఖిలకోటికి

అయ్యప్ప భజన ఆత్మశుద్ధికి 

అయ్యప్ప దర్శనం జన్మ ధన్యం 

అయ్యప్ప జ్యోతి అజ్ఞాన నాశనం .."హరి"


దీక్షలు మొదలయ్యేది కార్తీక మాసం 

నల్లని వస్త్రాలు విభూది నీ ఆహార్యం 

నెయ్యాభిషేకం కర్పూర హారతి నీకిష్టం

స్వామి శరణం అంటూ జపిస్తారు నీనామం. .."హరి" 


అదిగదిగో వస్తున్నాడు శార్దూల వాహనుడు 

మహిషనుచంపిమహిమలుఎన్నోచూపించి

రాజాధిరాజుడై శ్రీ మణికంఠుడై

మహిలో అవతరించినమహిమాన్వితుడు

                                                    " హరి"

దీక్షలు చేయండి భక్తులారా 

ధన్యులు కారండి భక్తులారా 

ఆత్మ శుద్ధి చేసుకోండి అయ్యలారా 

ఆత్మానందం పొందండి అన్నలారా ."హరి"


రచన -లోకనాథం సత్యానందం మాస్టారు శ్రీకాకుళం, ఫోన్ 9182863928.






Comments

Popular posts from this blog

కలబంద కబుర్లు

భస్మాసుర హస్తమా!A.I.

గొప్ప చిత్రం' గాంధీ'