భస్మాసుర హస్తమా!A.I.
కూలీ నెంబర్ వన్ చిత్రం లో (కలయ నిజమా)స్టైల్
భస్మాసుర హస్తమా!(ఏ.ఐ)
పల్లవి-
కలయా నిజమా! ఈ ఏ.ఐ.మాయ నిజమా!
అలవాటైన సుఖమా !ఇక నిన్ను ఆపగలమా!
విజ్ఞాన వనరు సుఖమా! అది ఎంతవరకు నిజమా.!
చరణం -1
చేయలేని ఎన్నెన్నో పనులు చేస్తానంటూ వస్తుంది
మాయ చేసి మసి చేసి ఇక్కడ గారడీ చేస్తుంది
నిజాలు అబద్ధాలుగా అబద్దాలు నిజాలుగా, మార్చుతూ ఉంటది
మతి పోగొడుతుంటది
నిజమా మాయయో మనకర్థం కాదయో
చరణం -2
ఏఐ చేసిన ఏమి చేసినా.. ఓహో అంటూ
ఉంటామే
మాయ చేసినా మర్మమేసిన ...ఆహా అంటూ నమ్ముతామే,
చిత్రమైన చిత్రాలెన్నో కళ్ళకు కడుతూ ఉంటది
కన్ను కట్టు చేసినట్టుగా భ్రమలో ముంచు తుంటది
భస్మాసుర హస్తమా! ఈ వింత లోకమా!
రచన -లోకనాథం సత్యానం
దం, శ్రీకాకుళం.
Comments
Post a Comment