"హెల్మెట్"

           * హెల్మెట్ *

బండి నడపరా భయ్యా 

జాగ్రత్తగా ఉండరయ్య  

ప్రాణం ముఖ్యం కదరయ్య 

ఆలోచించి కదలరయ్య ...... . బండి 


కుర్రకారు కల కాదనను కాని 

బైక్ కొనడం తప్పనను కాని

విన్యాసాలు ఎందుకు చేస్తవ్

ప్రాణాలు మీదకు ఎందుకు తెస్తవ్.. "బండి 


పెళ్లి అయితే బైక్ కోరుతరు

తల్లి తండ్రుల బుర్ర తింటరు

ఫైనాన్స్ పెట్టి అయినా కొంటరు 

కాని జాగ్రత్త లెందుకు తీసుకోరు .."బండి "


అన్ని పత్రాలు ఉన్న వారెందరు?

ఎందుకంత అలసత్వం కొందరు

బళ్ళమోజుకంటే ప్రాణం గొప్పది 

తెలిసినా ఎందుకు తెలుసుకోరు.. "బండి "


ఫోన్ పోతుందిని గార్డు పెడతారు 

బండెక్కితే హెల్మెట్ ఎందుకు పెట్టరు

భార్య పిల్లలు గుర్తు తెచ్చుకో వలె

బాధ్యతగాను బండి నడపవలె "బండి"

  

రచన -లోకనాథం సత్యానందం,మాస్టారు శ్రీకాకుళం, ఫోన్ -9182863928.


హెల్మెట్ పెట్టుకో జీవితాన్ని నిలబెట్టుకో 

ఆదమరిచావో ఆపదలో పడ్డట్టే 

ఫోనుతో డ్రైవింగ్ చేయొద్దు 

హెల్మెట్ పెట్టకుండా ప్రయాణం వద్దు 

బయలుదేరే ముందు భార్య హెల్మెట్తో ఎదురవ్వాలి. 

అతి స్పీడ్ ప్రమాదకరం.

ప్రయాణం

లో ప్రశాంతత ఉండాలి









Comments

Popular posts from this blog

కలబంద కబుర్లు

భస్మాసుర హస్తమా!A.I.

గొప్ప చిత్రం' గాంధీ'