గొప్ప చిత్రం' గాంధీ'
గాంధీ గారి గురించి మన దేశమే కాదు, ప్రపంచమంతా కొనియాడుతుంది. ఆయన సిద్ధాంతాలు, సందేశాలు ప్రపంచంలో ఎంతోమందిని ప్రభావితం చేశాయి. భారతదేశ జాతిపిత గాంధీ గారి గురించి ఇంగ్లీషులో ఒక చిత్రం తీయడం జరిగింది "గాంధీ" అని పేరుతో.
గాంధీ జయంతి 2026అక్టోబర్ 2, మహాత్మా గాంధీ 157వ జన్మదినం గా జరుపుకుంటున్నాము. ఈరోజు మరో మహానుభావుడు లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి కూడా జరుపుకుంటున్నాం ,ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో అహింస దినోత్సవంగా ఈ రోజు నిర్వహిస్తారు.
సత్యము, అహింస ,శాంతి మార్గాలను, ప్రపంచానికి చాటిన మహాత్ముడు, గాంధీ గారు,వారి ఆశయాలు స్మరించుకుంటూ, ప్రముఖులు రాజ్ ఘాట్ వద్ద నివాళులు అర్పిస్తారు.
ఈ సందర్భంగా ఇంగ్లీషులో తీసిన గాంధీ సినిమా గురించి చెప్పుకుంటే,ఈ సినిమా కేవలం ఒక జీవిత చరిత్ర మాత్రమే కాదు, ప్రపంచానికి అహింసా విలువలు చాటిన ఒక అద్భుత దృశ్య కావ్యం . గాంధీ గారిని ప్రభావితం చేసిన పుస్తకాలు, 'అంటు ది లాస్ట్' జాన్ రష్కిన్ రచించింది, "ది కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ వితిన్ యు "లియో టాల్ స్టాయ్.రచన.
1982లో గాంధీ సినిమా విడుదలైంది. ప్రధాన పాత్ర గాంధీ బెన్ కింగ్ స్లే నటించారు, రోహిణి హట్టంగడి కస్తూరిబా పాత్రలో రాణించారు, దర్శక నిర్మాణం , రిచర్డ్ ఆటెన్ బరో,మన దేశ గొప్ప సంగీత విద్వాంసుడు రవిశంకర్ ఈ సినిమా కు సంగీత దర్శకత్వం వహించారు.కాస్ట్యూండిజైనర్ గా భాను అథైయా, భారతదేశ తరుపున ఆస్కార్ అవార్డు అందుకున్నమొట్టమొదటి వ్యక్తిగా నిలిచారు.
గాంధీ సినిమాను రచించిన వారు, జాన్ బ్రిలీ,బడ్జెట్ 22 మిలియన్లు ఈ సినిమా వసూలు చేసింది 127.8 మిలియన్లు. ఈ సినిమా భారతదేశం అనే కాకుండా ప్రపంచాన్ని ఆకట్టుకుంది , ఇందులో అనేక అద్భుత సన్నివేశాలు ఉన్నా ప్రముఖమైనటువంటివి రైలులో గాంధీ గారి అవమానం, భారతదేశ పర్యటన, చంపారణ్ సత్యాగ్రహము ,జలియన్ వాలా బాగ్ దురంతము ,దండి యాత్ర, గాంధీ గారి చనిపోయిన అంత్యక్రియల మహాదృశ్యము. ఇందులో మూడు లక్షల కంటే ఎక్కువ అదనపు నటులు నటించారని ఒక విశేషం.55వ ఆస్కార్ అవార్డు వేడుకల్లో ఈ సినిమాకు 11 విభాగాల్లో నామినేట్ అవ్వగా 8 ఆస్కార్ అవార్డుల లభించాయి.
పై సమాచారం ఎలక్ట్రానిక్ మాధ్యమాల నుండి సేకరించి నాదైన పద్ధతిలో తయారు చేసినది అని తెలియజేస్తున్నాను. మీ అమూల్యమైన సలహాలు, సూచనలు, కామెంట్లు, తెలియజేయండి.
Comments
Post a Comment