"పార్వతి పుత్రుని పాట"

           *పార్వతి పుత్రుని పాట*

గౌరమ్మ తనయ గణపతి దేవ 

కాపాడ రావ కరుణించు దేవ

 విఘ్నాలు బాపే విఘ్నేశ్వరుడా


అమ్మ నలుగుతో బొమ్మగా మారి

నాన్న గొడవతో రూపము మారి

ఆది పూజుడై అఖిలలోకాలకు 

వినాయకుడివై వెలుగొందినావు


గరిక పూలు అన్న గొప్ప ఇష్టము

పప్పు బెళ్లాలంటే పరమ ఇష్టము 

కుడుము ఉండ్రాళ్ళు ఇంకా ఇష్టము 

వెలగ పళ్ళు పళ్ళు అంటే చాలా ఇష్టం 


శంభు తనయుడు శుభంకరుడు 

విఘ్న వినాశకుడు విజయ స్వరూపుడు

ఎలుక వాహనంపై ఎల్ల లోకములు తిరిగే

పార్వతి పుత్రుడు పరమ దయాకరుడు


జయ జయ విఘ్నేశా జయము నీయవా

శుభకర గణేశా శుభముల నీయవా 

ఆనందరూపుడా ఐశ్వర్యాన్నీయవా

ఆది దేవుడవు నీవు అభయము నీయవా


పేరు -లోకనాథం సత్యానందం మాస్టా

రు 

ఊరు -శ్రీకాకుళం.





Comments

Popular posts from this blog

కలబంద కబుర్లు

భస్మాసుర హస్తమా!A.I.

గొప్ప చిత్రం' గాంధీ'