స్థానిక ఎన్నికల సమరం

        పంచాయతీ ఎన్నికల కవిత.-1

----------------------------------------------

స్థానిక ఎన్నికలొస్తున్నాయి, సమరానికి 

సిద్ధం కండి,

కుల, మతాలు, కాసులు, వరుసలు కలుపు కుని రండి.


దేశానికి ప్రెసిడెంట్ ఎంత గొప్పో 

గ్రామానికి ఇతడంతే గొప్ప 

పూర్వం రోజులు పోయాయి 

కొత్త రోజులు వచ్చాయి 


డబ్బులు బాగా పెట్టాలి 

బిస్కెట్ లు బాగా వేయాలి 

అమ్మ ,చెల్లని, కలపాలి

కష్టాలు తీరుస్తానని చెప్పాలి,


వాగ్ధానాలు ఇవ్వాలి 

అయినాక వదిలేయాలి

కానివి చేస్తానని చెప్పాలి 

నోట్లో బూరెలు వండాలి


గ్రామంలో పార్టీలు కొన్ని ఉంటాయి 

మనవైపెవరని లెక్కలేసుకుంటాయి

గోడమీద పిల్లలు కొన్ని ఉంటాయు 

అవి ఎటుదూకుతాయో తెలియకుంటాయి,


మూలనున్న ముసలమ్మలను మోసు కొస్తారు,

దూరాన ఉన్న వారిని రాబెడతారు 

ఈ ఓటు ఎలా ఇచ్చారని వాదిస్తారు 

నీకొకటి నాకొకటని సర్దుబాటు చేస్తారు 


రచన -లోకనాథం సత్యా

నందం,మాస్టారు, శ్రీకాకుళం.



Comments

Popular posts from this blog

కలబంద కబుర్లు

భస్మాసుర హస్తమా!A.I.

గొప్ప చిత్రం' గాంధీ'