పులస పులుసు అంటే పడి చస్తారు
పుర్పుర్రెకో బుద్ధి జిహ్వకో రుచి అంటారు, శాఖాహారులైతే పులిహోర ,మువ్వవంకాయ, అని కారాలు మిరియాలు నూరుమంటారు. మాంసాహారులైతే గుడ్డు నుంచి మొదలుపెట్టి రకరకాలు చవిచూస్తారు, చేపలంటే మరికొందరికి మహా ప్రీతి అందులోకి జూలై నెల మొదలైంది అంటే సెప్టెంబర్ వరకు ఈ పులస విశేషాలు ఉంటాయి, పులస గురించి ప్రసిద్ధ సామెతలు కూడా ఉన్నాయి, ఇల్లు తాకట్టు పెట్టి పేకాటడం చూసాం కానీ పెంకుటిల్లు అమ్మిఅయినా తినమంటారు ,కొందరు, చివరికి పుస్తులమైన పులస తినాలంటారు మరికొందరు, రుచికి దాసోహం అయిపోతారు, పులస సాధారణంగా జూలై సెప్టెంబర్ నెలలో గోదావరి వరదలు వచ్చే వర్షాకాలంలో ఈ చేపలు సముద్రం నుండి నదిలోకి ఎదురుగా వస్తాయి ,ఎర్రటి వరద నీటిలో ఎగబడి ప్రయాణించడం వల్ల వీటి ప్రత్యేకమైన రుచి వస్తుంది. ఈ చేప ధర డిమాండ్ బట్టి కేజీ 2000 నుంచి 20000 వరకు పలుకుతుంది, పులస రుచిలో కాదు మంచి పోషక విలువలకు కూడా కలిగి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి అంటారు, ధవలేశ్వరం బ్యారేజీ, పొట్టిలంక ,గన్నవరం, బోడసముద్రం ,యానం, రబ్బనపల్లి కోడితీవ గ్రామం లో దొరికేవి మంచి డిమాండ్ అంటారు.