"దేశం యొక్క దీన స్థితి"

         *దేశం యొక్క దీనస్థితి*

ఏమిటమ్మా ఈ పరిస్థితి 

దేశం యొక్క దీనస్థితి 


స్వేచ్ఛ కోసం పడే తపన

ఎన్నెన్నో పోరాటాలు 

ఎన్నెన్నో త్యాగాలు 

నేతల జైలు శిక్షలు 

చవిచూసిన అక్రమ చట్టాలు 

తెల్ల దొరలు దాష్టికాలు

చెప్ప లేని ఘోరాలు 

వెలుగు చూడని వాస్తవాలు 

రెండు శతాబ్దాలు పోరాటం 

స్వేచ్ఛ వచ్చింది సంతోషాన్నిచ్చింది

కానీ ఏం లాభం 

                              "ఏమిటమ్మా "

గడుస్తున్నాయి సంవత్సరాలు 

కొన్ని లాభాలు కొన్ని నష్టాలు 

కొన్ని మంచి కొన్ని చెడులు 

 నేరాలు తగ్గటం లేదు 

ఘోరాలు ఆగటం లేదు 

మనకు మనమే శత్రువులం 

మనకు మనమే రాక్షసులం ... ఏమిటమ్మ


ఆడపిల్లలని ఆలోచించరు 

కామ పిశాచులు

సొంత వారని కూడా చూడరు

అధికార ఆరాటంలో

ఏమైనా చేస్తారు డబ్బు సంపాదనలో

గంజాయి వ్యాపారం 

దొంగతనాలు దోపిడీలు

మత్తుమందు వ్యవహారాలు

దేశరహస్యాలు అయినా....ఏమిటమ్మ


నిను పెంచే ఆవులు అవసరం 

తీరిపోతే కబేళాలకు పంపిస్తారు.

నిను పెంచే తల్లి తండ్రుల ను

ఓల్డేజ్ హోం లకు పంపుతారు 

నీవు సాయం చేసే మనిషి 

నిను మరిచి పోతాడు

నీవు బాగుచేసే మనిషి 

నీ ఇంటికి కన్నం వేస్తాడు.... ఏమిటమ్మ

రచన -లోకనాథం సత్యానందం 

మాస్టారు శ్రీకాకుళం.ఇది నా స్వీయ రచన.






Comments

Popular posts from this blog

కలబంద కబుర్లు

భస్మాసుర హస్తమా!A.I.

గొప్ప చిత్రం' గాంధీ'