"సారవ కోట చుప్పులు సాంగ్"

       సారవ కోట చుప్పులు సాంగ్ 

చుప్పులమ్మ చుప్పులు సారవకోట చుప్పులు

కొరికి కొరికి తింటేను పరపరమంటాయి 


బియ్యప్పిండి వేస్తారు 

నూలు పప్పు కలుపుతారు 

ముద్ద గానే చేస్తారు 

వృత్తల్లా చుడతారు 


నూనెలోన వేపుతారు 

ఏగినాక తీస్తారు 

వడగట్టి ఉంచుతారు 

ప్యాకింగ్ లు చేస్తారు


ఊరి మీద బస్సెలితే కేకలే వేస్తారు 

పిల్లలైతే ఎగబడి సందడే చేస్తారు 

తెలిసినోళ్ళు ఎక్కువే కొంటారు 

కొత్తగా కొన్నోళ్లు భలేగుందంటారు 


ఆడపిల్ల సారెలకు పెద్దవి చేస్తారు

చుట్టాలింటికెళితే పట్టుకు పోతారు 

అతిధులు ఇంటికి వస్తే చిరుతిళ్ళుగ పెడతారు

 కొత్తగా తిన్నోళ్ళు ఏమి రుచి అంటారు.


రచన -లోకనాథం సత్యానందం మాస్టారు శ్రీకాకుళం.ఫోన్ 9182863928

.

ఇది నా స్వీయ రచన.


 



Comments

Popular posts from this blog

కలబంద కబుర్లు

భస్మాసుర హస్తమా!A.I.

గొప్ప చిత్రం' గాంధీ'