"పెళ్లి మాయ"

               * పెళ్లి మాయ*

పెళ్ళీడొచ్చిందని ప్రయత్నాలు చేశారు 

మగ పిల్లలు పెళ్లంటే మహా చికాకుగా ఉంది మరీ నాడు


పెళ్ళీడు వచ్చింది పిల్లకు తిరిగాను

ఎన్నెన్నో చూసాను ఒక పిల్ల నచ్చింది 

కట్నం ఇవ్వనన్నారు సరే అని అన్నాను

కానుకలు అన్నారు వద్దులే అన్నా


తీరా ఆలు చేసిన మాయమేటంటే

బాగున్న రెండో అమ్మాయి చూపించి 

 మొదటమ్మాయి కి మేకప్ వేసి పెళ్లి చేశారు.

నీ కళ్ళేమో కాకు లెత్తుకెళ్ళాయా అనవచ్చు, తొందర్లో కొన్ని పొరపాట్లు 

జరిగి పోతాయి కదండి 

అదే ఆలకి వరంగా నాకు శాపంగా 

మారింది.


మేకప్ చేసి మాయం చేసావే అమ్మాయమ్మ 

తొలగించి తీరా చూస్తే తెలిసిందే 

తాయారమ్మ 

కలలెన్నో కన్నానే కాజోలమ్మ

ఆశలెన్నో పెట్టుకున్న అనసూయమ్మ


ఆశలన్ని అడియాశలైనాయి తాయారమ్మ 

కలలన్నీ కల్లలయినాయి ఓ కాంతమ్మ

మంచి కూడుకు కూరదొరకదుఓ మల్లమ్మ

నా బాధెవరితో చెప్పుకోను ఓ భారతమ్మ


పచ్చచేలలో పరికిణి కట్టిన పిల్లలా 

గట్టుమీద చెంగు చెంగున ఎగిరే దూడలా 

ఆకాశం నుంచి దిగి వచ్చిన దేవతలా

అనుకున్నా ఎంతెంతో ఆశతో 


వచ్చి పడింది పంది పిల్లలా 

అరుస్తుంది గాడిద పిల్లలా 

నోరు తెరుస్తుంది గాడ్జిల్లాలా

బోర్లాపడుకుంటుంది భల్లూకం లా


పడుకుంటుంది గురక పెడుతోంది 

వెనుక నుంచి గాలి వదులుతుంది 

నిద్ర లో టప టప కొడుతుంది 

కాలితో గాడిద లా తంతుంది 


ఎట్టాభరించేది ఎంకాయమ్మ 

కాశీకీ పోతానే కామాక్ష మ్మ 

సన్యాసినై పోతానే సన్యాసమ్మ

పెళ్ళి ఎందుకు చేసుకున్నానే పోలేరమ్మ

 రచన -లోకనాథం సత్యానందం,శ్రీకాకుళం 








Comments

Popular posts from this blog

కలబంద కబుర్లు

భస్మాసుర హస్తమా!A.I.

గొప్ప చిత్రం' గాంధీ'