"అమ్మ పాట"

              *అమ్మ పాట*

అమ్మాయి లో తన బొమ్మ చూస్తది 

అబ్బాయి లో తన నాన్న చూస్తది 

తన జీవితానికి ఒక అర్థ మంటది 

తన పిల్లలే తనకు స్వర్గ మంటుంది


అమ్మ రా అదే , అమ్మారా

మన జన్మరా,జీవితమ్మురా,

నిను పుట్టించిన బ్రహ్మ రా

నిను రక్షించిన సైన్యమ్మురా



చీకటి గర్భము నుంచి 

జాగ్రత్తగా నిను రక్షించి

భూమి పైకి నిను దించి 

మురిపెము నీ కందించి


మురిసి పోయిన అమ్మరా 

ప్రాణాలు తెగించిన అమ్మరా

పంచ ప్రాణాలు నీవురా 

నీ వెన్నంటె ఉండేనురా


నీవు తడిపిన బట్టలు తుడిచి 

పొడి పొడి బట్టలు పరచి

తడిపై తను పడుకుండి

వెచ్చని నిచ్చే దమ్మరా


కన్ను పడిన ఓర్చుకుని

పడుకున్న వరకు తెరుచు కుని

కావలి కాసే సిపాయిరా 

కను పాపై నిత్యము కాయిరా


అమ్మ రుణం నీవు తీర్చలేవురా 

అది ఒమ్ము కాదు నిజమ్మురా

అణువణువు నిండి ఉందిరా

నీ ప్రతి రూపం ఆమె ఆకారంరా


రచన -లోకనాథం సత్యానందం,మాస్టారు

 శ్రీకాకుళం.ఫోన్-9182863928.










Comments

Popular posts from this blog

కలబంద కబుర్లు

భస్మాసుర హస్తమా!A.I.

గొప్ప చిత్రం' గాంధీ'