"కొండ కన్నీరు"

            * కొండ కన్నీరు*

నాలో బండలున్నాయి 

గండెలేదను కుంటున్నారా 

ఊరి ప్రక్క కొండగా ఉన్నాను 

కాని ఊరిని గమనిస్తున్నాను 

ఎలా ఉండే పల్లెలు ఎలా అయ్యాయి

బంధాలు అనుబంధాలు ఎలా 

తయారయ్యాయి,

పండుగలుపబ్బాలుఎలా మారిపోయాయి

మానవుని ఆశ ఎలా మితి మీరి పోతుంది

చక్కటి చెరువులును ఆక్రమించేస్తున్నాడు

కొండలును కొట్టి పిండి చేస్తున్నాడు 

పాపం పాలిచ్చే ఆవులుని ఇవ్వడం 

 ఆపడంతో 

కబేళాలకు పంపే స్తున్నాడు 

చద్దన్నం తిని పనిచేసుకునేవాడు 

సాయింత్రం ముందుకు బానిసయ్యాడు 

ఊరికి ఇద్దరో ముగ్గురో ఉండే నాయకులు 

 నేడు వీధికొక డయ్యాడు

అన్నదమ్ముల వాటాల మధ్య దూరి

అన్యాయానికి ఒడిగడు తున్నాడు 

పశుల పాకలు తగ్గి మెకానిక్ 

షెడ్డులు వెలిసాయి,

పల్లెలు పట్టణాలు వాసన చూసి 

రంగులద్దు కుంటున్నాయి 

అందరికీ ఆదాయాలు కావాలి 

ప్రతీరోజూ పట్నం పోవాలి 

రోజూ ప్రత్యేక భోజనం కావాలి 

ప్రశాంతంగా ఉన్న ఇంట్లో పొగ రాజేయాలి 

నోరున్నోడిదే రాజ్యం అయ్యింది 

లాజిక్ తెలిసినోడి దగ్గరే జనం పోగయ్యారు

భూములు ఖరీదై పోయాయి 

రకరకాలు వ్యాపారాలయి పోయాయి 

సంపాదన సంపాదన సంపాదన 

స్మశానాలు ఆక్రమించే స్తున్నారు 

కోవిల నీడ పడిన చోటు ఇళ్ళు 

కట్టకూడదుఅన్న కొట్టి పారేస్తున్నారు

అద్వైతం మాటలు ఎదురు తిరిగే 

 సమాధానాలు 

పెద్ద చిన్న లేని పెడసర విధానాలు 

ఏభై ఏళ్ళు క్రితం వరదలోచ్చినప్పుడు 

నేనండగా ఉన్నాను వరదెక్కువైతే

నాపైనే ఉండాలనే కొండపై

పెద్దలు తో పాటు నేను ఎక్కి కూచున్నాను

మరి నన్నే మూడొంతులు తగలెట్టేశారు

కూచున్న కొమ్మనే నరుక్కుంటారా

మనసు లేని మానవులారా

కలి ప్రవేశించి నప్పుడు 

మంచి చెప్పిన విన్నవాడెవడాయె

యధాకాలం తథాగతిహి.


       లోకనాథం సత్యానందం మాస్టారు,

                       

                   శ్రీకాకుళం .

ఇది నా స్వీయ రచన.



Comments

Popular posts from this blog

కలబంద కబుర్లు

భస్మాసుర హస్తమా!A.I.

గొప్ప చిత్రం' గాంధీ'