"సిక్కోలు వైభవము"
*సిక్కోలు వైభవము*
సిక్కోలు వైభవము కనరార
సిక్కోలు చరితము వినరార
పుణ్యచరితలున్న పుడమిరా ఇది
ధన్య చరితలు గన్న ధరణిరా ఇది
త్యాగధనులు నిలిచిన వసుధరా ఇది
కళలకు కాణాచియై వెలుగురా ఇది
నాగావళి పరవళ్ళు తొక్కింది ఈనేల
వంశధార ఉరకలేసింది ఈ చోట
బాహుదా మహేంద్రనదులు నడచినవి ఇక్కడ
నలువైపులా నీళ్ళు నడయాడినిలిచినవి
ముఖలింగ ఆలయ శిల్ప కళా వైభవము
సూర్యనారాయణుని ప్రత్యక్ష దర్శనము
శ్రీకూర్మమున వెలసిన శ్రీ విష్ణు అవతారం
రావి వలసలో వెలసిన ఆఎతైన లింగము
స్వదేశీ పరదేశీయులు పాలించిరీచోట
సంస్కృతుల సమ్మేళనం జరిగింది ఈచోట
కలిసి మెలిసి పెరిగి నిలిచింది ఈచోట
శ్రీకాకుళం జిల్లాగామారింది చరితలో
సాహితీ లోకాన మేటి మహనీయులెందరో
పలు రచనలు చేసి ప్రఖ్యాతి నొందారు
గిడుగు,గరిమెళ్ళ,గౌతు లచ్చన్న లు
వంటి వారెందరో చరితలున్న నేల
వలస పక్షులు వచ్చి విహరించె నిచ్చట
బౌద్ధారామాలు చరితమున్నదిచ్చట
కళాకారులుఎందరో ఖ్యాతి నొందిరిచ్చట
క్రీడాకారులు ఎందరో కీర్తినొందిరిచట
జయము జయము తల్లి సిక్కోలు తల్లి
జయ విజయములిమ్ము శ్రీకాకుళపుతల్లి
రచన-లోకనాథం సత్యా
నందం,శ్రీకాకుళం.
Comments
Post a Comment