"ప్రజల దైవం పైడిమాంబ తల్లి"

   (ప్రతి సంవత్సరం దసరా తర్వాత విజయనగర లో పైడిమాంబ పండుగ చేస్తారు, అశేష జనవాహిని తరలివస్తారు)

     * ప్రజల దైవం పైడిమాంబ*

వందనాలు వందనాలు పైడిమాంబ తల్లి 

శతకోటి వందనాలు అమ్మవారు తల్లి 

ఉత్తరాంధ్ర దైవంగా కొలుస్తారు తల్లి 

కోరిన కోర్కెలు తీర్చే కరుణామయి తల్లి 


ఆది పరాశక్తి రూపం నీవమ్మ

అఖిల లోకానికి తల్లివి నీవమ్మ

ఆపదలో ఆదుకున్న అమ్మ వు నీవమ్మ 

పాడి పంటలనిచ్చే పౌష్య లక్ష్మివినీవమ్మ


ప్రతి ఏటా పండుగ చేస్తారు తల్లి 

భయ భక్తులతో పూజిస్తారు తల్లి 

దూరదూరం నుంచి వస్తారు తల్లి 

దర్శనమైతే చాలు తరిస్తారు తల్లి 


సిరిమానులోఅమ్మవారు ఆవహిస్తావమ్మ

అదృశ్యం కోసంజనం ఎదురు చూస్తారమ్మా

ఇసుకపోస్తే రాలనంత జనమొస్తారమ్మా

జేజేలు పలుకుతారు పైడిమాంబ తల్లికి


రచన -లోకనాథం సత్యానందం, మా

స్టారు శ్రీకాకుళం .




Comments

Popular posts from this blog

కలబంద కబుర్లు

భస్మాసుర హస్తమా!A.I.

గొప్ప చిత్రం' గాంధీ'