"తెలుగు గొప్ప దనం తెలుసుకో బిడ్డ"
*తెలుగు గొప్ప తనం తెలుసుకోబిడ్డ*
తెలుగు గడ్డ మీద పుట్టే పురిటి బిడ్డ
తెలుగు ఎందుకు అంత నీరసం బిడ్డ
నన్నయ నుంచి నేటి వరకు సాహిత్యం
నరనరాన జీర్ణించుకుంది మన గడ్డ
అందమైన భాష అజంత భాష అని
దేశ భాషలందు తెలుగు లెస్స అని
పలు ప్రక్రియలు కల్గు గొప్ప భాషని
వచియించుట నీ చెవులకు తాక లేదా
వేయేళ్లకు ముందు నుంచి ఉందని
పలు రాజులు కాలంలో పోషించెనని
ఉధ్ధండ పండితులెందరో వెలిగి రని కనలేదామన నేల కాల చరిత నందు
కృష్ణ రాయలు నోట కీర్తించిన మాట
విదేశీయులు ఇటాలియన్ ఈస్ట్ అన్న మాట.
పక్క రాష్ట్ర కవులు పలుకు మాట
మన భాష సొగసు గొప్ప దన్నమాట
అవధానం ఆవకాయ మన సొంతం
అజంతా భాష అందమైన అక్షర ఆకారం
సంగీత సాహిత్యాలకు అనువైన భాష
అనవరతము అనర్ఘ రత్నం ఆణిముత్యం
రచన -లోకనాథం సత్యానందం, మాస్టారు శ్రీ
కాకుళం.ఫోన్-9182863928.
Comments
Post a Comment