గుప్పెడు గింజలు తో గుండె పదిలం
సూర్యుడు దిశలో తిరిగే ఒక ఆకర్షణీయమైన పసుపు రంగు పువ్వును పొద్దు తిరుగుడు పువ్వు లేక సూర్యకాంతంపువ్వు అంటారు ,సూర్యుడిని అనుసరించడం ప్రకృతిలో ఒక అద్భుతమైన ఈ పువ్వును, ప్రాన్స్ రాజైన 14 వ లూయి, తన చిహ్నంగా పెట్టుకున్నాడు .
1510లో స్పానిష్ పరిశోధకులు మొట్టమొదట న్యూ మెక్సికోలో చూసి స్పెయిన్ కు అక్కడి నుంచి మిగిలిన దేశాలకు ఈ పువ్వుని ప్రాచుర్యంలోకి తెచ్చారు.
పొద్దు తిరుగుడు విత్తనాలలో ప్రోటీన్స్ తో పాటు నూనె, కాల్షియం లభిస్తాయి.అలాగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ,గుండె ఆరోగ్యం మెరుగుకు, కొలెస్ట్రాల్ తగ్గించడంలో, రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణలో ,చర్మాన్ని కాపాడటంలో, సహాయపడతాయి, రోజుకు ఒక చిన్న గుప్పెడు(30 గ్రాములు) తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదంటారు.
విత్తనాలు వేయించి చిరుతిండిగా, సలాడ్ గా, స్మూతీలు, బేకింగ్ వంటకాలలో కూడా వాడతారు.
అయితే వేటిని తీసుకున్నా జాగ్రత్తలు పాటించాలి, అలాగే ఈ గింజలు మీద పెంకు తీసి గింజలను ఉపయోగించాలి, ఎక్కువ తీసుకోవడం వల్ల అతిసారము , కడుపు ఉబ్బరం, తిమ్మిరి వంటివి వచ్చేసమస్యులు ఉంటాయని వైద్యుల సూచనలు.
వివిధ ఎలక్ట్రానిక్ మీడియాలలో సమాచారం ఆధారంగా నా దైన పద్ధతిలో తయారు చేయబడింది.
Comments
Post a Comment