గరివిడి లక్ష్మి సినిమా పై జానపద గీతం"
*గరివిడి లక్ష్మి" సినిమాపై జానపద గీతం*
-------------------------------------------------
పల్లవి -అందరూ చూడగ రారండి బాబు
అమ్మ లక్కలు చూద్దాం రారండి అమ్మ
చ-అందరూ చూసిన సినిమాలు ఎన్నో వచ్చాయి కానీ
ఈ సినిమా చాలా బాగుంది
గరివిడి లక్ష్మి బుర్రకథ సినిమా తీశారు
ఆమె పాట మాట నచ్చి అందరు మెచ్చారు,
చ-కష్టాలు ఎన్నో ఓర్చి ఆమె కళాకారిణి
అ్యయ్యింది
బాలనాగమ్మ కథల బాగా చెబుతుంది
నాన్న లేని చిన్నతనాన్ని ఎన్నో కష్టాలు పడింది
గరివిడి దగ్గర పుట్టిన ఆమె గరివిడి లక్ష్మి అయ్యింది,
చ-80-90 దశకాల్లోన ప్రదర్శనలు ఇచ్చింది,
పదివేలకు పైగా స్టేజీ లెక్కి పేరు పొందింది,
సినిమాలు వచ్చి జానపద కళల ఆదరణ తగ్గింది,
తోటి వారితో బేధాలు వచ్చి బాధలు పెరిగాయి,
చ-లక్ష్మీ అమ్మ సన్యాసినిగా దేవుడమ్మ అయింది,
బాల్య వివాహం చేసి లక్ష్మీ కొంప మునిగింది,
నమ్మినోడు మోసం చేసి నడిరోడ్డున వదిలేస్తే,
కన్నీళ్లను గుండెల్లో దాచి కళ వైపే నడిచింది,
చ-కష్టాలోర్చి కళాకారిణిగా పేరు పొందింది,
బృందంలో తగువులు వచ్చి ఆదరణ తగ్గింది,
అద్భుతమైన గొంతు అజ్ఞానం లోకి వెళ్ళింది,
కళాకారిణి కన్నీటి కథే ఈ సినిమా అయింది.
రచన- లోకనాథం సత్యానందం,మాస్టారు శ్రీకాకుళం'ఫోన్ -9182863928.
Comments
Post a Comment