"అప్పటి రోజులు గుర్తొస్తున్నాయి""
(అరవై దాటిందా)
*అప్పటి రోజులు గుర్తొస్తున్నాయా!*
ఆవకాయ వదిలి అరవై ఏళ్లుఅయ్యె
పిండి ఒడియం రుచి దూరమయ్యే
వెన్న ముద్దలాంటి చద్దన్నం ముద్దలేవి,
మంటైనా పచ్చి మిరప రుచేది
సిల్వరు,స్టీల్ క్యేరేజ్ లు పట్టుకుని
గబగబ నడుచుకుంటూ పరిగెత్తుతూ
దారంట తూరీగలు పట్టుకుంటూ
నేరేడు చెట్టు ఎక్కి పళ్లేరు కుంటూ
వర్షంలో తడుచుకుంటూ
చెట్లు కింద దాక్కుంటూ
షర్టుఇప్పి మామిడికాయలు ఏరుకుంటూ
గురువులకు దొరికి దెబ్బలు తింటూ
బాధలో ఉన్న బాల్యం భలే ఆనందం
ఇంటర్వెల్ లో బెల్లం జీడిఉండలు
నోరూరించే రంగు పుల్ల ఐస్ లు
జేబులలో అమ్మచ్చిన పాకుండలు
కాకి ఎంగిలి చేసి పంచుకుంటూ
చెరువులుదగ్గర క్యారేజ్ లువిప్పుకుంటూ
పకపక నవ్వుకుంటూ తింటూ
బాలకృష్ణుని బాల్యక్రీడలలా
ఆహారం ఆరగించేవారం ఆనందంగా
సుఖం దుఃఖం కొంతసేపే
కోపం తాపం మరి కొంతసేపే
కలిసిమెలిసి జీవన బాల్యం
కలుషితం లేని ఆ స్నేహం
ఆనాటి బాల్యం ఏనాటికి
మరిచి పోలేని మధురానుభూతి
తలచుకుంటే వస్తుంది సంతోషం
అది బూస్ట్ కంటె బెటరనిపిస్తుంది.
రచన -లోకనాథం సత్యానందం, మాస్టారు, శ్రీకాకుళం, కేరాఫ్
కరవంజ.
25-2-2026.ఇది నా స్వీయ రచన.
Comments
Post a Comment