"అందరికీ అమ్మ ఆశీస్సులు"
*అందరికీ అమ్మ ఆశీస్సులు*-
పల్లవి:
దండాలు దండాలు బతుకమ్మ
శతకోటి దండాలు బతుకమ్మ
చల్లంగ చూడమ్మా బతుకమ్మ
ఎల్లప్పుడూ కాపాడు బతుకమ్మ
" దండాలు "
అమ్మ వారి రూపు గౌరమ్మ
ఆదిపరాశక్తి గౌరమ్మ
ప్రకృతి రూపమ్ము గౌరమ్మ
పూలలో దాగున్న గౌరమ్మ. "దండాలు "
అమ్మలక్కలందరు అమ్మవారిలా మారి
పసుపు కుంకుమలతో ముతైదువులై
పలురకాల పూలు, పసుపు, సిద్ధం చేసి
పుష్ప పీఠాన్ని తయారు చేస్తారు భక్తి తో
" దండాలు "
తంగేడు పూలలో తల్లివి నీవమ్మ
మందారాలు లో ఉండేది నీవమ్మ
చామంతులతో చల్లగా చూస్తావమ్మ
రకరకాలు పూలతో దీవిస్తవమ్మ
"దండాలు "
పాడిపంటలు వృద్ధి కలగజేయమ్మ
పిల్ల పాపల్ని చల్లగ చూడమ్మా
కష్టాలు నష్టాలు లేకుండా చూడమ్మా
నీవు దయచూపితే సర్వం శుభమమ్మ.
"దండాలు "
రచన-లోకనాథం సత్యానందం, మాస్టారు
ఫోన్ -9182863928.
హామీ
పత్రం -ఇది నా స్వీయ రచన.
Comments
Post a Comment