ఒక స్వీట్ పీస్ 3000 రూపాయలు

 స్వీట్స్ తినే వారికి ఆశ షుగర్ పేషెంట్లకు నిరాశ ,కానీ స్వీట్స్ లో రకరకాలు ఉంటాయి, ఖరీదైన ఉంటాయి. పేదవాడు 5 రూపాయలు స్వీట్ తింటే మధ్య తరగతి వాడు ఒక పీస్ 30రూపాయలు, తింటే ,ఒక స్వీట్ పీస్ ఏకంగా 3000 రూపాయలు అంటే ఆశ్చర్యం కాక మరేమీ 

అది ఎక్కడ అంటారా! మన దేశంలోనే రాజస్థాన్ లోని జైపూర్ లో తయారైన "స్వర్ణ ప్రసాదం" అనే స్వీట్ పీసు 3000 రూపాయలు, కేజీ ధర వింటే గుండెలు గుభేలు మంటాయి, 1 లక్ష 11 వేల రూపాయలు. ఈ ఖరీదైన స్వీట్, పైన్ నట్స్  (చిల్గోజా) కుంకుమపువ్వు ,బంగారు భస్మము వంటివి కలిపి తయారు చేస్తారట. 

బంగారు భస్మం కలపడం ఏమిటి అంటే? ఆయుర్వేదంలో దీనిని శుద్ధి చేసి వాడినట్లుగా,బంగారాన్ని శుద్ధి చేసి తినదగినట్లుగా కలుపుతారట.

మనదేశంలో ఖరీదైన స్వీట్లు తెలుసుకుంటే, ఢిల్లీ, లక్నోలో, లభించే" స్వర్ణ మిఠాయి" దీని ధర కేజీ 20 నుండి 30 వేల రూపాయలు, అలాగే గోల్డ్ ప్లేటెడ్ మోతీచూర్ లడ్డు, దీని ధర కేజీ 12 నుండి 15000, అలాగే డ్రై ఫ్రూట్ హల్వా దీని ధర కేజీ 8000 నుండి 10000 వరకు, ఇలా వివిధ రకాలైన స్వీట్లు ఉన్నాయి, దీపావళి రోజుల్లో ప్రత్యేకమైనవి, ఖరీదైనవి కూడా తయారు చేస్తారు.

వివిధ ఎలక్ట్రానిక్ మాధ్యమాల లోని ముఖ్యాంశాలు ఆధారంగా నాదైన పద్ధతిలో మీకు అందజేయడం జరుగుతుంది నమస్తే. మీ అమూల్యమైన సలహాలు, కామెంట్లు, ఇస్తారని ఆశిస్తున్నాను.


Comments

Popular posts from this blog

కలబంద కబుర్లు

భస్మాసుర హస్తమా!A.I.

గొప్ప చిత్రం' గాంధీ'