"శ్రీకాకుళం జిల్లా ఊరు కాయలు"
* శ్రీకాకుళం జిల్లా ఊరు కాయలు*కవిత
అమ్మ అనసూయమ్మ
అల్లుడు అమాయకుడనుకున్నాం కాని
ఏరిఏరి ఊరి ఊరి కూరగాయలు తెచ్చాడే
సంతకవిటి సంత కెళ్ళి
వంగర వంకాయలు
ఆమదాలవలస ఆనపకాయలు
సారవకోట సారికంద
అల్లాడ అల్లం
కొత్తూరు కరివేపాకు
టెక్కలి టెంకాయలు
పలాస పనస కాయలు
కవిటి కొబ్బరి కాయలు
పొన్నాడ పొట్లకాయలు
సింగుపురం సిరగడి
పాలకొండ పొడుగు చిక్కుడు
మందస మామిడి కాయలు
అంపోలు అరటికాయలు
నివగాం నిమ్మ కాయలు
గార గుమ్మడి కాయలు
కరజాడ కాకరకాయలు
సీతంపేట సీతాఫలాలు
రాజాం రాంఫలాలు
వినేవాడుంటే
చెప్పేవాడు ఏదైనా చెపుతాడు,
మా ఊరి మిరియాలు తాటికాయలంత
అన్నాడట, నన్ను అలా అనుకున్నా
పర్వాలేదు కానీ
ప్రాసకుదిరింది కదా అని ప్రాకులాడాను.
లోకనాథం సత్యానందం మాస్టారు,
శ్రీకాకుళం.
Comments
Post a Comment