"శివాజీ సింహం"
(శివాజీ మహారాజ్ జయంతిసందర్భంగా)
*శివాజీ సింహం*
సింగమురా శివాజీ సింగమురా
దేశభక్తితో వెలిగిన రాజసమ్ము రా
హైందవంలో పుట్టిన అధ్భుతమ్ము రా
ఉదయించిన అరుణారుణ బింబమురా
జాతి మనుగడే ప్రశ్న గా మారిన
జ్వలించిన అనల విస్ఫులింగమురా
ఛండ ప్రచండ మారుతమ్ము రా
ఉరిమి ఉరిమి విరుచుకు పడు నిప్పు కణమురా,
ఉగ్గుపాలతో పాటు దేశభక్తి భుజించిన
అగ్గి పిడుగు ఆటలు తో రాటుదేలిన
పరదేశీయులంటే పరమ చిరాకు పడిన
మన జాతి శ్రేయస్సునే సదా కాంక్షించిన
ఒంటి నిండ గాయాలు, కంటినిండ క్రోధం
అలుపెరుగని దాడులు,అహర్నిశం ఆవేశం
ధైర్యమే సాహసం, సడలని మనో నిబ్బరం
ఒక్కడైన చాలు వేయిమంది తో సమానం
ఎత్తుకు పై ఎత్తు తోనే చిత్తు చేసె వైనం
గెరిల్లా పోరాటంతో గుణపాఠపు నైజం
పక్కా ప్రణాళికతో పథక రచన చేయడం
ఒంటరి పోరాటంఎందరికోస్ఫూర్తిదాయకం
రచన :-లోకనాథం సత్యానందం మాస్టారు,శ్రీ
కాకుళం,ఫోన్ 9182863928.
Comments
Post a Comment