"ఆంధ్రులు రుణపడిన అమరజీవి"

  (ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం నవంబర్ 1) 

  *ఆంధ్రుల రుణపడిన అమరజీవి*

అమర జీవికి ఆంధ్రులు రుణపడి ఉన్నారు 

హాయిగా స్వేచ్ఛగా బతుకుతున్నారు 

రాజకీయ నాయకులు దండలు దండాలు పెడుతున్నారు 

దేశభక్తులు వారి గురించి కొనియాడుతున్నారు 

పట్టణాల వారి బొమ్మలపై దండలు పడుతున్నాయి 

గాంధీ ఎవరంటే అడగబోయే రానున్న తరానికి 

శ్రీరాములు త్యాగం ఎంతమంది అర్థం చేసుకున్నారో తెలియదు 

మద్రాస్ తో కూడిన రాష్ట్రానికి 

తెలుగు వారు పడుతున్న అవమానాలకి 

ఎందరో అసమ్మతి తెలియజేసిన 

పట్టించుకోని ప్రభుత్వాలు నాయకులు 

పెద్ద సమస్యగా ఎవరూ తీసుకోలేదు

తెలుగువారి రాష్ట్రానికి తనువు ఒక్కటే త్యాగం 

అని నమ్మి నిలిచి నిరాహారదీక్ష చేసి 

నీరసించి క్రమక్రమంగా ప్రాణాలు 

హరించబోతాయని తెలిసిన 

పట్టు వదలని పొట్టి శ్రీరాములు 

ప్రాణ త్యాగం చేసి అమర జీవయ్యాడు 

ప్రాణాలు పోయినా స్పందించని జనం 

ప్రకాశం ఘంటసాల వంటి వారు 

త్యాగ గొప్పతనాన్ని జనుల్లో మేలుకొలిపితే

ఆంధ్ర ప్రజలు అందుకొని అల్లకల్లోలం చేయడంతో 

కేంద్రం దిగివచ్చి తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేసింది. 

తెలుగు వారికోసం ప్రాణత్యాగం చేసిన మహానీయుని నిత్యం స్మరిస్తూనే ఉండాలి ఆంధ్రులు.

రచన-లోకనాథం

 సత్యానందం,శ్రీకాకుళం.




Comments

Popular posts from this blog

కలబంద కబుర్లు

భస్మాసుర హస్తమా!A.I.

గొప్ప చిత్రం' గాంధీ'